ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోరుగా కోడిపందేలు

ABN, First Publish Date - 2023-01-15T00:53:52+05:30

సంక్రాం తి పండుగ సందర్భంగా శనివారం పలుచోట్ల కోడిపందేలు జోరుగా నిర్వహిం చారు. నిర్వాహకులు బరులు ఏర్పాటు చేశారు. పందెంరాయుళ్లు నెలల తర బడి పెంచిన పందెం కోళ్లను తీసుకొచ్చి పోటీలు వేశారు. పల్లెల నుంచి పట్ట ణాల వరకు ప్రజలు ఎంతో ఉత్సాహంతో తిలకించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పెద్దమొత్తంలో చేతులు మారిన సొమ్ములు

  • పలుచోట్ల పేకాట, గుండాట నిర్వహణ

  • నిర్వాహకుల ప్రత్యేక ఏర్పాట్లు.. లాఠీ ఎత్తని పోలీసులు

దేవరపల్లి/గోపాలపురం/నిడదవోలు/చాగల్లు/పెరవలి, జనవరి 14: సంక్రాం తి పండుగ సందర్భంగా శనివారం పలుచోట్ల కోడిపందేలు జోరుగా నిర్వహిం చారు. నిర్వాహకులు బరులు ఏర్పాటు చేశారు. పందెంరాయుళ్లు నెలల తర బడి పెంచిన పందెం కోళ్లను తీసుకొచ్చి పోటీలు వేశారు. పల్లెల నుంచి పట్ట ణాల వరకు ప్రజలు ఎంతో ఉత్సాహంతో తిలకించారు. పందేం జరిగే ప్రదే శాల్లో పందెంరాయుళ్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు తాగునీరు, తినుబండరాలు వంటివి సైతం ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది కన్నా ఈ ఏడాది ముందుగానే కోడి పందేలకు పోలీసులు అనధికార అంగీకా రాన్ని తెలియజేశారు. నిన్నటి వరకు చట్టపరమైన చర్యలు, అవగాహన సద స్సులు, బైండోవర్‌ కేసులు అంటూ హడావిడి చేసిన రెవెన్యూ అధికారులు, పోలీసులు ఒక్కసారిగా సైలెంట్‌ అయిపోయారు. మరోపక్క కోడి పందేల అనుమతులకు అధికారులతో పెద్దమొత్తంలోనే సొమ్ములు చేతులు మారినట్టు సమాచారం. దేవరపల్లి మండలంలో దేవరపల్లి, దుద్దుకూరు, గౌరీపట్నం, త్యాజంపూడి, కృష్ణంపాలెం, కురుకూరు, యాదవోలు, బంధపురం గ్రామాలు, నిడదవోలు మండలంలోని విజ్జేశ్వరం డి.ముప్పవరం, కోరుమామిడి, కాటకూటే శ్వరం, తాడిమళ్ళ, శింగవరం, నిడదవోలు పట్టణంలోను కోడి పందేలు జోరుగా సాగాయి. చాగల్లు మండలంలోని మీనానగం, ఊన గట్ల, బ్రాహ్మణగూడెం, చిక్కాల గ్రామాల్లో ప్రత్యేకం గా బరులు ఏర్పాటు చేసి కోడి పందేలు జోరుగా నిర్వహించారు. మండలంలో ఏర్పాటు చేసిన ఐదు బరుల్లో లక్షలాది రూపాయలు చేతులు మారినట్టు చెబుతున్నారు. వీటితో పాటు పేకాట, గుండాట నిర్వహించారు. పెరవలి మండలంలో పెరవలి, అజ్జరం, ముక్కామల, ఖండవల్లి, మల్లేశ్వరం, పిట్టలవేమవరం తదితర గ్రామాల్లో బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. రూ.వెయ్యి నుంచి పది వేల వరకు పందాలు కాస్తున్నారు. గుండాటకు వేయక పోవడంతో జూదరులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

Updated Date - 2023-01-15T00:53:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising