ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సాయం మరిచారు.. బయట పడేశారు!

ABN, First Publish Date - 2023-06-26T01:07:23+05:30

అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఈ చిత్రం.. విభిన్న ప్రతిభావంతుల కోసం దాతలు లక్షలు ఖర్చులు చేసి కొనుగోలు చేసి ఇచ్చిన వీల్‌ చైర్లు, హ్యాండ్‌ స్టిక్స్‌ నిరుపయోగంగా ఎండకు ఎండుతూ వాన కు తడుస్తూ ఉన్నాయి..అయినా కన్నెత్తి చూసిన వారే లేరు..

రాజమహేంద్రవరం హుకుంపేటలో బయటపడేసిన దివ్యాంగుల సైకిళ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం రూరల్‌ , జూన్‌ 25 : అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఈ చిత్రం.. విభిన్న ప్రతిభావంతుల కోసం దాతలు లక్షలు ఖర్చులు చేసి కొనుగోలు చేసి ఇచ్చిన వీల్‌ చైర్లు, హ్యాండ్‌ స్టిక్స్‌ నిరుపయోగంగా ఎండకు ఎండుతూ వాన కు తడుస్తూ ఉన్నాయి..అయినా కన్నెత్తి చూసిన వారే లేరు.. కనీసం ఎందుకిలా పడేశారని ప్రశ్నించిన వారూ లేరు. పరిశ్రమలు, కొన్ని సంస్థలు తమ లాభాల్లో కొంత మొత్తాన్ని కార్పొరేట్‌ రెస్సాన్సిబిలిటీ ఫండ్స్‌ రూపంలో ప్రభుత్వ సంస్థలకు, స్వచ్ఛంద సంస్థలకు పరికరాల రూపేణా ఇస్తారు. అలా వచ్చిన పరికరాలను అవసరమైన వారికి అందించడం అధికారుల బాధ్యత..ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించ కపోవడంతో కొత్తవే అయినా తుప్పు పడుతున్నాయి. ఎందుకూ పనికిరాకుం డా పోతున్నాయి.ఇదెక్కడో కాదు జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న హుకుంపేటలో నెలకొంది. గుజరాత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు వీల్‌ చైర్లు, చేతికర్రలు అందజేశారు. వీటన్నింటి బాధ్యత రూరల్‌ మండల పరిషత్‌ కార్యాలయం అఽధికారులకు అప్పగించినట్టు చెబుతున్నారు. మండల పరిషత్‌ సమావేశమందిరం బ్యాలెట్‌ బాక్సులతో నిండిపోవడంతో వీటిని హుకుంపేటలో నిర్మాణంలో ఉన్న సచివాలయం భవనంలో ఉంచారు. సచివాలయ పనులు ఆరంభించడం తో సుమారు 100కు పైగా వీల్‌ చైర్లు, హ్మాండ్‌ స్టిక్‌లు కుప్పలుగా ఆవరణలో పడేశారు. లక్షలాది రూపాయల విలువ చేసే ఉపకరణాలు అలా పడవేయడంపై అధికారుల తీరుపై గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు విమర్శిస్తున్నారు. ఇదే విషయమై పంచాయతీ కార్యదర్శి వెంకట్రావును వివరణ కోరగా వీటిని ఎవరు కొనుగోలు చేసారో తమకేమీతెలియదని మండల పరిషత్‌ అధికారులు ఆదేశాలలో తమ కార్యాలయం ఆవరణలో ఉంచామన్నారు. ఎంతో మంది దివ్యాంగులు ఉపకరణాలు లేక ఇబ్బందులు పడుతుంటే మూలన పడేసి ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి మూలన పడేసిన ఈ ఉపకరణాలను లబ్ధిదారులను అందించాలని పలువురు సూచిస్తున్నారు.

Updated Date - 2023-06-26T01:07:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising