అటు దంచేసి...ఇటు ముంచేసి
ABN, First Publish Date - 2023-05-02T01:45:26+05:30
అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీవర్షాలు దంచి కొడుతు న్నాయి. ఎడతెరిపి లేకుండా మోస్తరునుంచి భారీస్థాయిలో వానలు విరుచుకు పడుతున్నాయి. దీంతో కాకినాడ నగరంతోపాటు అనేక పట్టణాలు, గ్రామాలు సోమవారం ఎక్కడికక్కడ జలమయమయ్యాయి. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు వర్షం నీరు పోటెత్తడంతో అనేక రహదారులు, లోతట్టు ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు నీటమునిగాయి.
-అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు
-కాకినాడ మెయిన్ రోడ్డు, కార్పొరేషన్ రోడ్డుతోపాటు లోతట్టు ప్రాంతాలు జలమయం
-సామర్లకోట, పెద్దాపురం, జగ్గంపేట, రౌతులపూడి, కరప, పిఠాపురంలో ఎడతెరిపివ్వని వానలు
-భారీ వర్షాల ధాటికి సామర్లకోటలో పాక్షికంగా కూలిపోయిన మూడు ఇళ్లు
-కాకినాడ రెవెన్యూ డివిజన్‌లో పలు మండలాల్లో ముంపులో ప్రభుత్వ కార్యాలయాలు
-అకాల వర్షాలతో 15వేల ఎకరాల్లో వరి మునక: పలుచోట్ల కళ్లాల్లో తడిచిపోయిన ధాన్యం
-ఈనెల 4వరకు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీగా కురవనున్న వర్షాలు
-కలెక్టరేట్‌లో 18004253077 నెంబర్‌తో కంట్రోల్ రూం ఏర్పాటు
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీవర్షాలు దంచి కొడుతు న్నాయి. ఎడతెరిపి లేకుండా మోస్తరునుంచి భారీస్థాయిలో వానలు విరుచుకు పడుతున్నాయి. దీంతో కాకినాడ నగరంతోపాటు అనేక పట్టణాలు, గ్రామాలు సోమవారం ఎక్కడికక్కడ జలమయమయ్యాయి. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు వర్షం నీరు పోటెత్తడంతో అనేక రహదారులు, లోతట్టు ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు నీటమునిగాయి. జిల్లా కేంద్రం కాకి నాడలో సోమవారం ఉదయం ఆరు గంటలకే దాదాపు ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో మెయిన్‌రోడ్డు, కార్పొరేషన్ రోడ్డు, టూ టౌన్ ఏరియా మొత్తం నీటమునిగింది. రాకపోకలకు వీల్లేకుండా మారడంతో వాహనదా రు లు ఇబ్బందులకు గురయ్యారు. భారీవర్షానికి డ్రైన్లు పొంగడంతో పలు డివిజ న్లలో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. సామర్లకోటలో సోమవారం తెల్లవారుజామునుంచీ వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలు నీటమునగగా, హుస్సేన్‌పురంలో మూడు పెంకుటిళ్లు పాక్షికంగా కూలిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న వారంతా ఒక్కసారిగా ప్రా ణభయంతో అల్లాడిపోయారు. భారీ వర్షానికి కాకినాడ, సామర్లకోట ఆర్టీసీ బ స్టాండ్లు నీటమునిగిపోయాయి. కరప, జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, గొల్ల ప్రోలు, ఏలేశ్వరం, గండేపల్లి, కిర్లంపూడి, తునిరూరల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలకు లోతట్టుప్రాంతాలు మునిగిపోవడంతో జనం నరకయాతన పడ్డారు. ఎక్కడికక్కడ కాలువలు పొంగడంతో రాకపోకలకు వీల్లేకుండా పోయింది. అనే క ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లోకి వర్షపు నీరు వెళ్లిపోవడంతో అవన్నీ నీటమునిగాయి. ముఖ్యంగా ప్రత్తిపాడు ఒమ్మంగి సగరపేట పాఠశాలలోకి నీళ్లు వెళ్లడంతో మొత్తం జలమయమైంది. కరప ఎంపీడీవో కార్యాలయం ముం పునకు గురైంది. అనేక మండలాల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, ప్రభు త్వ కార్యాలయాలు, స్కూళ్లు నీటమునిగాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు అనేక మండలాల్లో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉండడంతో అత్యధికంగా సామర్లకోటలో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమో దైంది. రౌతులపూడిలో 5.6, పిఠాపురం 4.8, కాకినాడ నగరం ఎమ్మార్వో కార్యాల యం పరిసరాల్లో 4.7 సెంటీ మీటర్లు, తాళ్లరేవు 4.7, యు.కొత్తపల్లి, పెద్దాపురం 4.3, కాజులూరు 4.2, కాకినాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో 4.1, కరప 4, సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మిగిలిన మండ లాల్లో 3 నుంచి 2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా సోమవారం 21 మండలాలు కలిపి 57 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, సరాసరి 2.7 సెంటీమీటర్లుగా నమోదైంది. కాగా ఈనెల 4 వరకు అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి కంట్రోల్‌రూంను ఏర్పాటు చేశారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా 18004253077 నెంబర్‌కు సంప్రదించాలని అధికారులు కోరారు.
రైతులకు మళ్లీ కన్నీరే..
ఏటా అకాలవర్షాలు జి ల్లాలో అన్నదాతల నడ్డివిరు స్తున్నాయి. ఆరుగాలం శ్ర మించి పండించిన పంట చే తికి వస్తుందనుకునే సమయంలో భారీవర్షాలు తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా రబీ పంట చేతికి వచ్చే సమయం కావడంతో ఎక్కడికక్కడ కోతలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల కోతలు పూర్తయి కుప్పలు వేయగా మరి కొన్నిచోట్ల నూర్పిళ్లు జరుగుతున్నాయి. ఈ తరుణంలో వర్షాలతో పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ, సామర్లకోట, గండేపల్లి, కిర్లంపూడి, తొండంగి, యు.కొత్త పల్లి, ప్రత్తిపాడు, తాళ్లరేవు, కాజులూరు, గొల్లప్రోలుతోపాటు అనేక మండలాల్లో వరి పంట తీవ్రంగా దెబ్బతింది. చేలల్లోకి భారీగా వర్షపునీరు చేరడంతో పంట లు నేలవాలిపోయాయి. మరికొన్ని ధాన్యం రాశులు నీటిలో నానుతున్నాయి. ఆరబెట్టిన ధాన్యం పలుచోట్ల వర్షాలకు కొట్టుకుపోయింది. మొన్న ఖరీఫ్‌లో అకాల వర్షాలతో నష్టపోయామని ఇంకా బాధపడుతుంటే ఇప్పుడు రబీలోనూ అదే పునరావృతం కావడంతో నెత్తీనోరు బాదుకుంటున్నారు. సోమవారంరాత్రి వరకు కురిసిన భారీవర్షాలతో జిల్లావ్యాప్తంగా 15వేల ఎకరాలకుపైగా వరిపంట నీటమునిగింది. జిల్లా వ్యవసాయశాఖ మాత్రం 8వేల హెక్టార్లలో పంట ముని గిందని ప్రాథమికంగా అంచనా వేసింది. మరో మూడురోజులు వర్షాల ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో పంట నష్టం మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో రబీ కింద అన్నిమండలాల్లో కలిపి 65,352హెక్టార్లలో వరిసాగవగా ప్రస్తుతానికి 30,441 హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. వర్షాల ముప్పు పొంచి ఉన్నందున పంట నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు కలవరపడుతున్నారు. ప్రస్తుత వాతావ రణ పరిస్థితుల్లో అన్నదాతలు కోతలు కోయవద్దని జిల్లా వ్యవసాయశాఖ సూచించింది.
Updated Date - 2023-05-02T01:45:26+05:30 IST