ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రాసిం వల్ల చెడు జరిగితే పోరాటం చేస్తామనడం అవివేకం

ABN, First Publish Date - 2023-03-02T01:35:31+05:30

గ్రాసిం ఇండస్ట్రీవల్ల ప్రజలకు చెడు జరిగితే పోరాటం చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి పేర్కొనడం అవివేక మని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి

అనపర్తి, మార్చి 1 : గ్రాసిం ఇండస్ట్రీవల్ల ప్రజలకు చెడు జరిగితే పోరాటం చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి పేర్కొనడం అవివేక మని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళ వారం బిక్కవోలు మండలం బలభద్రపురంలో జరిగిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీ విస్తరణపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన చేసిన వ్యాఖ్యలను రామకృష్ణారెడ్డి ఖండించారు. బుదవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో తాను ప్యాక్టరీలో తయారయ్యే కెమికల్స్‌ వల్ల జరిగే అనర్థాలను వివరించానని అంతే కాకుండా భవిష్యత్‌లో తలెత్తే సాగు, తాగునీటి సమస్యలను కలెక్టర్‌కు వివరించానని అన్నారు. అంతేకాని తాను రాజకీయాలు మాట్లాడలేదన్నారు. మాట్లాడితే టీడీపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని పదే పదే చెబుతున్నారని కేవలం ప్యాక్టరీ బదలాయింపు మాత్రమే టీడీపీ చేసిందని దీనికి సంబందించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఒక వైద్యునిగా ప్యాక్టరీ వల్లజరిగే అనర్థాలు ఆయనకు తెలియవా ఎందుకు ప్రజలను మభ్యపెడు తున్నారని ప్రశ్నించారు. నాటి ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఇదే ప్యాక్టరీ అనుమతులు రద్దు చేస్తామని నిండు సభలో ప్రజలకు హామీ ఇచ్చారని ఈ సంగతిని ఎమ్మెల్యే ఎందుకు ప్రస్తావించ లేదని రామకృ ష్ణారెడ్డి ప్రశ్నిం చారు. గ్రాసిమ్‌ విస్తరణ జరిగితే భవిష్యత్‌లో జరిగే అనర్థాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన అన్నారు. ప్రజలకు నష్టం కలుగుతుందని వారి అంతరాత్మ కు తెలిసినా ఎందుకు ప్యాక్టరీ విస్తరణకు కొమ్ముకాస్తున్నారో ప్రజలు గహిస్తున్నారని అన్నారు.

Updated Date - 2023-03-02T01:35:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!