ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా జయేంద్ర సరస్వతి ఆరాధనోత్సవాలు

ABN, First Publish Date - 2023-03-05T02:23:01+05:30

జగద్గురువులు, పరమాచార్య జయేంద్ర సరస్వతి స్వాముల మహారాధనోత్సవాలు కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

శంకర విజయేంద్ర సరస్వతి శోభాయాత్ర

కొవ్వూరు, మార్చి 4 : జగద్గురువులు, పరమాచార్య జయేంద్ర సరస్వతి స్వాముల మహారాధనోత్సవాలు కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో నిర్వహించారు. కొవ్వూరు పట్టణంలోని ఆంధ్రగీర్వాణ విద్యాపీఠం నుంచి శనివారం రథంపై జయేంద్ర సరస్వతి చిత్రపటంతో కంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి పట్టణ పురవీధుల్లో శోభాయాత్రగా గోష్పాదక్షేత్రానికి చేరుకున్నారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రధాన స్నానఘట్టంలో శివలింగానికి గోదావరి జలాలతో అభిషేకించారు. శంకరాచార్యుల విగహ్రానికి తులసి మాలవేసి నమస్కరించారు. అనంతరం క్షేత్రంలోని ధర్మజ్ఞాన కళావేదిక మండపంలో కంచి కామకోటి పీఠం 69వ పీఠాధిపతి జగద్గురువులు శంకరాచార్య జయేంద్ర సరస్వతి మహారాధనోత్సవాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామివారి సంకీర్తనా కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి కొవ్వూరు పట్టణ పరిసర ప్రాంతాల నుంచే కాకుండే ఇతర రాష్ట్రాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కొవ్వూరు డీఎస్పీ వి.ఎస్‌.ఎన్‌.వర్మ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సంస్కృత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

Updated Date - 2023-03-05T02:23:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising