ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వరద గండం!

ABN, First Publish Date - 2023-07-21T01:28:41+05:30

గోదావరికి వరద వచ్చేసింది. భద్రా చలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కావడంతో డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలోని గోదావరి నదీతీర ప్రాంతాల వెంబడి ఉన్న గ్రామాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు.

ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక వద్ద గోదావరి ఉధృతి..

ఇప్పటికే పలు ప్రాంతాలకు స్తంభించిన రవాణా

లంక గ్రామాల ప్రజల తరలింపునకు పడవలు ఏర్పాటు

ముక్తేశ్వరం-కోటిపల్లి రేవులో నిలిచిన రాకపోకలు

జి.పెదపూడిలో నాలుగు లంక గ్రామాలకు పడవలే దిక్కు

ఏటిగట్ల బలహీనతపై నివేదికలు సిద్ధం చేయండి: కలెక్టర్‌ ఆదేశం

డివిజన్‌, మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ కాన్ఫరెన్సు

అమలాపురం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): గోదావరికి వరద వచ్చేసింది. భద్రా చలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కావడంతో డాక్టర్‌ బీఆర్‌ అంబే డ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలోని గోదావరి నదీతీర ప్రాంతాల వెంబడి ఉన్న గ్రామాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. అధికార యంత్రాంగం ముంద స్తుగా అప్రమత్తమైంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పెరుగుతోంది. భద్రాచలం వద్ద ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేయగా సాయంత్రానికి 44.10 అడుగుల నీటిమట్టానికి పెరిగింది. ఈ ప్రభావంతో ధవళేశ్వరంలోని కాటన్‌ బ్యారేజీ మొత్తం 175 గేట్లను పూర్తిగా ఎత్తి వేసి దిగువకు నీటి ప్రవాహాన్ని వదిలేస్తున్నారు. ఇక్కడ నీటిమట్టం సాయంత్రా నికి 8.80 అడుగులుగా నమోదుకాగా, సముద్రంలోకి ఆరు లక్షల క్యూసెక్కుల నీటిని వదిలివేస్తున్నారు. దీంతో మన జిల్లాలో ఉన్న గౌతమి, వశిష్ఠ, వైనతేయ, వృద్ధగౌతమీ నదీపాయల్లోకి వరద ప్రవాహం పొంగి ప్రవహిస్తోంది. పి.గన్నవ రం మండలం గంటిపెదపూడిలో నాలుగు లంక గ్రామాలకు వేసిన తాత్కాలిక రహదారి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొట్టుకుపోయింది. వరద ఉధృతి పెరగడంతో లంక గ్రామాల ప్రజల కోసం పడవలు ఏర్పాటుచేశారు. గౌతమీ నది పొంగడంతో కోటిపల్లి-ముక్తేశ్వరం రేవులో రాకపోకలను నిలిపివేశారు. పం ట్లు, పడవలను కోటిపల్లి వైపు నిలిపివేయడంతో రేవు దాటింపు ఆగిపోయింది. ముక్తేశ్వరం వైపు పాయ మధ్యలో రేవు నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన తాత్కా లిక రహదారిపై నుంచి వరదనీరు ప్రవహించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కోనసీమలోని నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాల్లోకి వరదనీరు స్వల్పంగా ప్రవేశిస్తోంది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నదీ పరీవాహక ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్లే వరద ఉధృతి తీవ్రమవుతుందని వాతావరణ శాఖ అధి కారులు సైతం ఇప్పటికే హెచ్చరించారు. భద్రాచలం వద్ద వరద పెరుగుతున్నం దున కోనసీమ జిల్లాలో కూడా వరద ముప్పు పొంచి ఉన్నట్టు అధికారులు భావి స్తూ ముందు జాగ్రత్తగా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. వరద తీవ్రత దృష్ట్యా కోనసీమ జిల్లాలోని తీర ప్రాంతవాసులు, అధికార యంత్రాంగం అప్ర మత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షుశుక్లా విజ్ఞప్తిచేశారు. వరద పరిస్థి తులపై వర్చువల్‌ విధానంలో కలెక్టర్‌ శుక్లా డివిజన్‌, మండల స్థాయి అధికారు లతో సమీక్షించారు. పలు ప్రాంతాల్లో ఏటిగట్లు బలహీనంగా ఉన్న దృష్ట్యా హెడ్‌ వర్క్స్‌ అధికారులు వాటి పటిష్టతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యం గా ఏటిగట్ల పరిరక్షణలో భాగంగా 500 మీటర్లకు ఒక వలంటీరును నియమించి ఏటిగట్లలో ఉన్న బలహీనతలను ఎంపీడీవోలకు నివేదించాలని, మండల స్థాయి లో సేకరించిన నివేదికను జిల్లా స్థాయిలో అధికారులకు అందించాలని సూచిం చారు. ముఖ్యంగా అప్పనపల్లి, పెదపట్నంలంక, బి.దొడ్డవరం, పాశర్లపూడిలంక, నాగుల్లంక, ఎల్‌.గన్నవరం, మానేపల్లి, మొండెపులంక ప్రాంతాల్లో గట్లు బలహీ నంగా ఉన్నందున ఎత్తు పెంచాలని సూచించారు. అంబాజీపేట మండలంలో వరద సమయంలో డ్రెయిన్లు పొంగే అవకాశం ఉన్నందున అధికారులు జాగ్ర త్తలు తీసుకోవాలన్నారు. సోంపల్లి, పొదలాడలంక, తాటిపాక, శివకోడులంక, సఖినేటిపల్లిలంక, అప్పనరామునిలంకల్లో వరద సహాయక చర్యలు ముందస్తుగా చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. కాట్రేనికోన మండలం పల్లంకుర్రు రేవు వద్ద ఇసుక బస్తాలతో వరద నీటి కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏటి గట్ల నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాల కల్పనకు కూడా చర్యలు తీసుకుని సిద్ధంగా ఉండాల్సిందిగా ఆయన సూచిం చారు. వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పాముకాటుకు గురయ్యేవారికి సత్వర చికిత్స అందించేందుకు వ్యాక్సిన్‌ సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించారు. 250 బోట్లను ఏర్పాటుచేయాలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. పలు అంశాలపై జిల్లా అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. ఈ సమావేశంలో డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ టీవీఎస్‌ఎన్‌ మూర్తి, ఈఈ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు బెంబేలు

కపిలేశ్వరపురం, జూలై 20 : గోదావరి నది వరద ఉధృతి గంటగంటకు పెరుగుతున్న నేపథ్యంలో నదీపరీవాహక ప్రాంతాలైన తాతపూడి, కపిలేశ్వరపురం, కోరుమిల్లి, కేదార్లంక, వీధివారిలంక, నారాయణలంక, పల్లపులంక అద్దంకివారిలంక గ్రామా ల ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పలుచోట్ల లంక పొలాల్లోని వరదనీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరద ఉధృతి కారణంగా కపిలేశ్వరపు రం, కోరుమిల్లి, తాతపూడి, పుష్కరఘాట్లకు నీరు చేరింది. గతేడాది వరదల్లో పలుచోట్ల బలహీనంగా ఉన్న ఏటిగట్టుకు ఇసుక మూటలు వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. పటిష్ట చర్యలు పూర్తిస్ధాయిలో చేపట్టకపోవడంతో వరద ఉధృతి అధికమైతే తమ పరిస్థితి ఏమిటని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

గంటిపెదపూడి వద్ద కొట్టుకుపోయిన తాత్కాలిక రహదారి

పడవలపై లంకవాసుల రాకపోకలు 8 ఇక దినదిన గండమే

పి.గన్నవరం, జూలై 20: గోదావరి వరద ఉధృతి పెరగడంతో పి.గన్నవరం మం డలం గంటిపెదపూడి, ఉడిమూడికి చెందిన నాలుగు లంక గ్రామాల వారు రాకపో కలు సాగించేందుకు ఏర్పాటుచేసుకున్న తాత్కాలిక రహదారి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొట్టుకుపోయింది. దీంతో గంటిపెదపూడి శివారు పెదపూడిలంక, బూరుగులంక, అరిగెలవారిపేట, ఊడిమూడి శివారు ఊడిమూడిలంక గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ప్రస్తుతం నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. అయితే ముందు జాగ్రత్తగా లంక గ్రామాల ప్రజ లు తమ ద్విచక్ర వాహనాలను ఇవతలి ఒడ్డునే ఉంచేశారు. ఇక నుంచి పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు తరలించుకునే రైతులు సైతం వరదకాలంలో నానావస్థలు పడాల్సిందే. కాగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుతోపాటు తహశీల్దార్‌ జీఆర్‌ ఠాగూర్‌, సీఐ డి.ప్రశాంత్‌కుమార్‌, మండల ప్రత్యేకాధికారి తిక్కా వెంకటేశ్వరావు, మత్స్యశాఖ జేడీ షేక్‌ లాల్‌మహ్మద్‌, ఎస్‌ఐ హరికోటిశాస్త్రిలు నదీపాయ వద్ద పరిస్థితిని పరిశీలించి సిబ్బందికి పలుసూచనలు చేశారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లా గ్రామాలైనా అనగార్లంక, పెదమల్లంక గ్రామస్తులు వైవీపాలెం, బెల్లంపూడి వద్ద నదీపాయల్లోకి వరదనీరు రావడంతో నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇక వీరందరూ దినదిన గండంగానే గడపాల్సి వస్తుంది.

లైఫ్‌జాకెట్లు లేకుండానే రాకపోకలు..

గంటిపెదపూడిలో బూరుగులంక నదీపాయను దాటుతున్న లంకగ్రామస్తులు లైఫ్‌జాకెట్లు లేకుండానే పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు లైఫ్‌జాకెట్లు ఇచ్చినప్పటికీ లంకగ్రామస్తులు మాత్రం వాటిని వినియోగించడం లేదు. ఈ విషయాన్ని అధికారులు పర్యవేక్షించకపోతే ప్రమాదకర ప్రయాణంగా మారుతుంది.

Updated Date - 2023-07-21T01:28:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising