దైవ దర్శనానికి వెళుతుండగా ప్రమాదం
ABN, First Publish Date - 2023-09-04T00:50:44+05:30
దైవ దర్శనానికి వెళుతూ రో డ్డు ప్రమాదంలో భర్త మృతి చెందాడు. భార్యకు తీవ్ర గాయా లైన ఘటన తునిరూరల్ జగన్నాఽథగిరి సెంటర్లో ఆదివారం చోటుచేసుకుంది.
లారీ ఢీకొని భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు
తుని రూరల్ జగన్నాథగిరి జంక్షన్ వద్ద ఘటన
తుని రూరల్, సెప్టెంబరు3: దైవ దర్శనానికి వెళుతూ రో డ్డు ప్రమాదంలో భర్త మృతి చెందాడు. భార్యకు తీవ్ర గాయా లైన ఘటన తునిరూరల్ జగన్నాఽథగిరి సెంటర్లో ఆదివారం చోటుచేసుకుంది. యు.కొత్తపల్లి మండలం నాగులాపల్లి గ్రామా నికి చెందిన నార్ల నాగదుర్గ(25) భార్యసాత్వికతో కలిసి ద్విచక్ర వాహనంపై మొక్కుచెల్లించేందుకు తలుపులమ్మలోవ పుణ్య క్షేత్రానికి వెళుతున్నారు. జగన్నా థగిరి వద్ద జాతీయ రహదారి దాటుతున్న క్రమంలో లారీ ఢీ కొట్టడంతో మోటార్ సైకిల్‌పై వెళు తున్న దంపతులిద్దరూ లారీ చక్రాల మధ్య ఇరుక్కున్నా రు. ఘటన లో నాగదుర్గ అక్కడికక్కడే మృ తి చెందగా, ఆ యన భార్య సాత్విక కొన ఊపిరితో గంటపాటు లారీ చక్రాల మధ్య ఇరుక్కుని నరకయాతన అనుభ వించింది. దీంతో స్థానికులు పెద్దఎత్తున గుమిగూడారు. స్ధానికులు పోలీసులకు, హైవే అధికారులకు సమాచారం ఇవ్వడంతో గంట శ్రమించి దంపతులిద్దరినీ బయటకు లాగారు. తీవ్రంగా గాయపడిన సాత్వికను ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీరికి మూడు నెలల క్రితమే వివాహమైంది. ఇంతలోనే తన కొడుక్కి నిండు నూరేళ్లు నిండిపోయాయంటూ మృతుడు తండ్రి కృష్ణ బోరున విలపించారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదుచేసి ప్రమాదానికి కారణమైన లారీ, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఆటో ఢీకొని యువకుడి మృతి
మరొకరికి గాయాలు
ఐ.పోలవరం, సెప్టెంబరు 3: 216 జాతీయ రహదారి ఐ.పోలవరం మండలం పాత ఇంజరం వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరొకరి తీవ్రగాయాలయ్యాయి. ఐ.పోలవరం మండలం కొత్తమురమళ్ళ గ్రామానికి చెందిన లంక సురేంద్రవంశీ శ్రీ (21) రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా మరొక వ్యక్తి ఉందుర్తి విష్ణు తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరూ యానాం నుం చి మురమళ్ళ వైపు మోటార్‌సైకిల్‌పై వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సురేంద్రవంశీశ్రీ అక్కడికక్కడే మృతిచెందాడు. మోటార్‌సైకిల్ వెనుక ఉన్న విష్ణు తీవ్రంగా గాయపడటంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు
Updated Date - 2023-09-04T00:50:44+05:30 IST