ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి స్వాధీనం

ABN, First Publish Date - 2023-05-02T00:48:41+05:30

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం పరిధిలోని సీతమ్మపేట శ్మశాన వాటిక సమీపంలో గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంపై సోమవారం మధ్యాహ్నం ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు మండపేట రూరల్‌ సీఐ శివగణేష్‌, రాయవరం ఎస్‌ఐ పీవీవీఎస్‌ఎన్‌ సురేష్‌ విలేకరులకు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయవరం, మే 1: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం పరిధిలోని సీతమ్మపేట శ్మశాన వాటిక సమీపంలో గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంపై సోమవారం మధ్యాహ్నం ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు మండపేట రూరల్‌ సీఐ శివగణేష్‌, రాయవరం ఎస్‌ఐ పీవీవీఎస్‌ఎన్‌ సురేష్‌ విలేకరులకు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. లొల్ల చింతలరోడ్డు ఎదురుగా ఉన్న సీతమ్మపేట శ్మశానవాటిక ఎదురుగా ఉన్న మురికి కాలువ గట్టు మర్రిచెట్టు వద్ద కొందరు వ్యక్తులు గంజాయి విక్రయాలపై మంతనాలు సాగిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై సీఐ శివగణేష్‌, ఎస్‌ఐ సురేష్‌, డిప్యూటీ తహశీల్దారు విజయరేఖ సంఘటన స్థలానికి చేరుకుని గంజాయి కలిగి ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చింతలపూడికి చెందిన కాలేపు విజయకుమార్‌ పారిపోతుండగా అతడ్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విజయ్‌కుమార్‌ నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్న మండపేట మండలం ద్వారపూడికి చెందిన చింతలపూడి చక్రధర్‌, కాకి పవన్‌ దుర్గారాజు, మండపేట టౌన్‌కు చెందిన మేక శివశ్యామ్‌ ప్రసాద్‌, మండపేట న్యూకాలనీకి చెందిన జెర్రీ రామచంద్రశ్యామ్‌, గంటా దుర్గాప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని, సీఐ శివగణేష్‌ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2023-05-02T00:48:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising