యానాం అబ్బాయి ఫ్రాన్స్ అమ్మాయికి పెళ్లి
ABN, First Publish Date - 2023-02-21T00:34:18+05:30
ఫ్రెంచ్ పౌరసత్వం కలిగిన వారిద్దరు తెలుగు సంస్క ృతి, సంప్రదాయరీతిలో హిందూ వివాహ పద్ధతిలో వివాహాన్ని ఘనంగా చేసుకున్నారు.
యానాం, ఫిబ్రవరి 20: ఫ్రెంచ్ పౌరసత్వం కలిగిన వారిద్దరు తెలుగు సంస్క ృతి, సంప్రదాయరీతిలో హిందూ వివాహ పద్ధతిలో వివాహాన్ని ఘనంగా చేసుకున్నారు. యానానికి చెందిన చింతా వెంకట్ కుటుంబం ఫ్రెంచ్ పౌరసత్వం కలిగి ఫ్రాన్స్ దేశంలో ఎన్నో ఏళ్లగా స్థిరపడి ఉన్నారు. ఫ్రెంచ్ పౌరసత్వం ఉన్నప్పటికి కొన్నిరోజులు ఫ్రాన్స్‌లో, మరికొన్ని రోజులు ఇండియా (యానాం)లో ఉంటున్నారు. అయితే చింతా వెంకట్, వేద దంపతుల కుమారుడు సుమంత్ సైతం ఫ్రాన్స్‌లోనే పుట్టి అక్కడే ఉంటూ ఉద్యోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశానికి చెందిన యువతి క్లమెన్‌టైన్‌తో సుమంత్‌కు వివాహం కుదిరింది. దీంతో ఆదివారం రాత్రి హిందూ సంప్రదాయ పద్ధతిలో తెలుగు సంస్కృతి సంప్రదాయాల ప్రకారం స్థానిక గాజుల గార్డెన్స్ కల్యాణ మండంలో సుమంత్, క్లమెన్‌టైన్‌ల వివాహం వైభవంగా జరిగింది. ఫ్రాన్స్‌కు చెందిన 30 మంది సుమంత్, క్లమెన్‌టైన్ బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. వారం రోజులు యానాంలో ఉన్న వీరంతా యానాం పరిసర ప్రాంతాలను సందర్శించారు. సుమంత్ బంధువులైన నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ దంపతులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.
Updated Date - 2023-02-21T00:34:19+05:30 IST