ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రైతు సమస్యలపై స్పందించకపోవడం విచారకరం

ABN, First Publish Date - 2023-06-26T00:20:57+05:30

రైతు ప్రభుత్వమని చెప్పుకొనే వైసీపీ ప్రభుత్వం రైతు లకు ఎదురౌతున్న సమస్యలపై స్పందించకపోవడం విచారకరమని, ఆకుమ డులు వేసుకోవడం నుంచి ధాన్యం అమ్ముకునే వరకు రైతులు అనేక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

నదురుబాద మైనర్‌ కాలువను పరిశీలిస్తున్నరామకృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నేటికీ పొలాలకు చేరని కాలువ నీరు

  • ప్రభుత్వ నిర్లక్ష్యంతో వెనుకబడిపోతున్న పంటలు

  • టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి

అనపర్తి, జూన్‌ 25: రైతు ప్రభుత్వమని చెప్పుకొనే వైసీపీ ప్రభుత్వం రైతు లకు ఎదురౌతున్న సమస్యలపై స్పందించకపోవడం విచారకరమని, ఆకుమ డులు వేసుకోవడం నుంచి ధాన్యం అమ్ముకునే వరకు రైతులు అనేక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని రామవరంలో నదురుబాద మైనర్‌ కాలువ గుర్రపు డెక్క, తూటు కాడతో మూసుకుపోయిందని, నారు మడులు వేసుకునేందుకు కూడా నీరందడం లేదని స్థానిక రైతులు దృష్టికి తీసుకురావడంతో రామకృష్ణా రెడ్డి రైతులతో కలిసి ఆదివారం పరిశీలించారు. అక్కడి నుంచే ఇరిగేషన్‌ ఎగ్జి క్యూటివ్‌ ఇంజనీర్‌కు ఫోన్‌ చేసినా ఆయన స్పందించకపోవడంతో ధవళేశ్వరం ఎస్‌ఈకి ఫోన్‌చేసి కాలువ పరిస్థితిని, రైతుల ఇబ్బందులను వివరించారు. దీనికి స్పందించిన ఎస్‌ఈ కాలువలు పూడుకుపోవడం నిజమేనని, రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడతామని అన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్భాటంగా జూన్‌ 1వ తేదీన కాలువ లకు నీరు వదిలినా ఇప్పటికీ రైతులకు నీరు చేరువ కాలేదన్నారు. నీరు వదిలి నెల కావస్తున్నా కాలువల్లో ప్రవాహం లేకపోవడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు వెనుకబడి చివరకు రైతులు తుఫా నుల బారిన పడి నష్టపోతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లమిల్లి సుబ్బారెడ్డి, సత్తాలు, వీరభాస్కరరెడ్డి, బసివిరెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణరెడ్డి, అన్నవరం, పలువురు రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:20:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising