ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం విడనాడాలి
ABN, First Publish Date - 2023-04-09T01:25:04+05:30
ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడాలని డిమాండు చేస్తూ ఏపీజేఏసీ అమరావతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాశాఖ ఆధ్వ ర్యంలో శనివారం అమలాపురంలో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఏపీజేఏసీ అమరావతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
అమలాపురం టౌన్, ఏప్రిల్ 8: ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడాలని డిమాండు చేస్తూ ఏపీజేఏసీ అమరావతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాశాఖ ఆధ్వ ర్యంలో శనివారం అమలాపురంలో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జిల్లాశాఖ చైర్మన్ డి.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గిడ్ల చిరంజీవి, వైస్‌చైర్మన్ ఐ.కొండయ్యల ఆధ్వర్యంలో ప్లకార్డులు చేతబూని పట్టణంలో ప్రదర్శన సాగించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లించాలని, పదకొండో పీఆర్సీ ప్రతిపాదించిన పేస్కేలు బయటపెట్టాలని, బకాయిపడిన నాలుగు డీఏల ఎరియర్స్ చెల్లించాలని, పన్నెండో పేరివిజన్ కమిషన్‌ను వెంటనే నియమించాలని, సీపీఎస్‌ను రద్దుచేసి పాతపెన్షన్ విధానాన్ని కొనసాగించాలనే ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోరుతూ నిరసన చేపట్టారు. గడియార స్తంభం సెంటర్‌లో మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించారు. జేఏసీ అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నంద్యాల రామచంద్రరావు, జె.నాగేశ్వరరావు, మేడిది శ్రీను, కె.రాంబాబు, చిక్కం రాజు, వి. నాగేశ్వరరావులు పాల్గొన్నారు.
తరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-09T01:25:04+05:30 IST