ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మాతృమరణాలు తగ్గించడానికి కొత్త మార్గదర్శకాలు : డీఎంఅండ్‌హెచ్‌వో

ABN, First Publish Date - 2023-08-22T01:11:45+05:30

రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు 21 : రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ గర్భందాల్చడం వల్ల మరణించకూడదనే సంకల్పంతో ప్రభుత్వం కొత్తగా కొన్ని మార్గదర్శకాలను జారీచేసిందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా గర్భిణీల రవాణా కోసం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ను తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశించడం జరిగిందని, ముందస్తు డెలివరీ తేదీకి ముందు తీవ్రమైన రక్తహీనత ఉన్న గర్భిణీని రక్త

రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు 21 : రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ గర్భందాల్చడం వల్ల మరణించకూడదనే సంకల్పంతో ప్రభుత్వం కొత్తగా కొన్ని మార్గదర్శకాలను జారీచేసిందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావు సోమవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా గర్భిణీల రవాణా కోసం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ను తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశించడం జరిగిందని, ముందస్తు డెలివరీ తేదీకి ముందు తీవ్రమైన రక్తహీనత ఉన్న గర్భిణీని రక్తమార్పిడి కోసం ఇంటి నుంచి ఆసుపత్రికి, ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లాల్సి ఉందన్నారు. అలాగే ఐరన్‌ సుక్రోజ్‌ ఇవ్వడానికి ఇంటి నుంచి ఆసుపత్రికి, ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లడానికి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వినియోగించాలన్నారు. ఉచిత టీఐఎఫ్‌ఎఫ్‌ఏ స్కానింగ్‌ తప్పనిసరిగా రెండుసార్లు, సాధారణ స్కాన్లు రెండుసార్లు చేయాల్సి ఉంటుందని, అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లోనూ డెలివరీలకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Updated Date - 2023-08-22T01:11:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising