ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పందనకు 167 వినతులు

ABN, First Publish Date - 2023-02-07T01:23:09+05:30

బొమ్మూరు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన స్పందనలో 167 అర్జీలు వచ్చాయి. ఉదయం నుంచి అంగన్వాడీల ధర్నా వల్ల కలెక్టరేట్‌ లోపలికి ద్విచక్ర వాహనాలు, ఆటోలు అనుమతించకపోవడంతో అర్జీదారులు ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు లోపలికి నడిచి రాలేక అవస్థలు పడ్డారు. మహిళలు, పెద్ద వయస్సువారు ఎండలో నడవక తప్పలేదు. వికలాంగులు, అర్జీదారులు పలు సమస్యలపై కలెక్టర్‌ను కలిసి సమస్యలు

స్పందనలో అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ మాధవీలత, జేసీ తేజ్‌భరత్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్నాతో అర్జీదారుల ఇక్కట్లు

అధికారుల కార్లకు మాత్రమే అనుమతి

బొమ్మూరు, ఫిబ్రవరి 6: బొమ్మూరు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన స్పందనలో 167 అర్జీలు వచ్చాయి. ఉదయం నుంచి అంగన్వాడీల ధర్నా వల్ల కలెక్టరేట్‌ లోపలికి ద్విచక్ర వాహనాలు, ఆటోలు అనుమతించకపోవడంతో అర్జీదారులు ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు లోపలికి నడిచి రాలేక అవస్థలు పడ్డారు. మహిళలు, పెద్ద వయస్సువారు ఎండలో నడవక తప్పలేదు. వికలాంగులు, అర్జీదారులు పలు సమస్యలపై కలెక్టర్‌ను కలిసి సమస్యలు తెలిపారు. కలెక్టర్‌ కె.మాధవీలత, జేసీ తేజ్‌భరత్‌ మాట్లాడుతూ నిర్ణీత సమయంలో సమస్యలు పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నవశకం పోర్టల్‌ ద్వారా ప్రతీ గ్రామ సచివాలయాల్లో సిబ్బంది కుటుంబ సభ్యుల డేటా ఆధారంగా ఆరు దశల వివరాలతో క్రోడీకరించడం జరుగుతుందన్నారు.

బిచ్చమెత్తుకుంటున్నా..

నా భర్తకు పింఛను వచ్చేది. అతను మరణించాడు. నాకు పిల్లలు లేరు. పింఛను కోసం అర్జీ పెట్టినా పట్టించుకోవడం లేదు. ఆఖరికి రోడ్డున భిక్షమెత్తుకుంటు న్నా. వలంటీర్లు ఇంకా సమయం పడుతుందని చెబుతున్నారు.

- వడ్లపాటి సీత, అంబేద్కర్‌ నగర్‌

కరోనా ముందు దరఖాస్తు చేశా

2020లో పింఛను కోసం అర్జీ పెట్టా. ఇంతవరకూ అధికారులకు పట్టించుకోలేదు. సచివాలయానికి తిరిగి అలిసిపోయా. వయసు 60 దాటినా నన్ను పట్టించుకోవడంలేదు. పింఛను డబ్బు నాకు చాలా అవసరం. తినడానికి తిండి లేక కష్టంగా ఉంది. కలెక్టర్‌కు సమస్య చెప్పాను.

- కనకదుర్గారావు, సుబ్బారావు నగరం

Updated Date - 2023-02-07T01:23:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising