ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రీసర్వే వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2023-02-07T00:54:53+05:30

ఏజెన్సీలో జగనన్న భూహక్కు, భూరక్ష కార్యక్రమం ద్వారా చేపట్టిన రీసర్వే వేగవంతం చేయాలని ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంపచోడవరం, ఫిబ్రవరి 6: ఏజెన్సీలో జగనన్న భూహక్కు, భూరక్ష కార్యక్రమం ద్వారా చేపట్టిన రీసర్వే వేగవంతం చేయాలని ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే అధికారులను ఆదేశించారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో సర్వేయర్‌లకు సర్వేకు సంబంధించిన పరికరాలు, రెయిన్‌కోట్లు, మెడికల్‌ కిట్లు పంపిణీ కార్యక్రమానికి ఆయన సబ్‌ కలెక్టరు శుభం బన్సల్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో రీసర్వే చేసి ప్రభుత్వ, రైతు వారి భూములకు హక్కు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. సుమారు 80 మంది గ్రామ సర్వేయర్లకు కిట్లు అందజేసినట్లు తెలిపారు. సర్వేకు ముందు గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ షెడ్యూల్‌ ప్రకారం సర్వే టీంలు అందుబాటులో ఉండాలన్నారు. సర్వేలో సమస్యలు ఉత్పన్నమైతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సర్వే ఆఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.దేవేంద్రుడు, డిప్యూటీ సర్వే ఆఫ్‌ ఇన్‌స్పెక్టర్లు రవిశంకర్‌, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:54:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising