ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విజిలెన్స్‌ దాడులు

ABN, First Publish Date - 2023-02-04T01:15:28+05:30

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో విజిలె న్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు దాడులు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరంసిటీ, ఫిబ్రవరి 3: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో విజిలె న్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు దాడులు చేశారు. రాజమహేంద్రవరం రీజనల్‌ ఎస్పీ పీవీ రవికుమార్‌ ఆధ్వర్యంలో మూడు బృందాలు తూ ర్పు, కాకినాడ, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో లీగల్‌ అండ్‌ మెట్రాలజీ, వ్యవసాయ శాఖలతో కలిసి ఎరువుల దుకాణాలపై దాడులు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో శ్రీధనేశ్వరి ట్రేడర్స్‌ ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు స్టాక్‌ రిజిష్టర్లు సక్రమంగా లేకపోవడం, నిల్వల్లో వ్యత్యాసాలను గుర్తించారు. ఈ మేరకు పెరవలి వ్యవసాయాధికారి రూ.2,50,639 విలువగల 15. 285 మెట్రిక్‌ టన్నుల ఎరువులు సీజ్‌ చేశారు. అదే గ్రామంలో డీసీఎంఎస్‌ను తనిఖీ చేసి స్టాక్‌ నిల్వల్లో వ్యత్యాసాలను గుర్తించి రూ.5,19,973 విలువ చేసే 24.19 మెట్రిక్‌ టన్నుల ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేశారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ పి.ముత్యాలనాయుడు, ఇన్స్‌పెక్టర్‌ రమేష్‌, వ్యవసాయాధికారి భార్గవ మహేష్‌, కానిస్టేబుల్‌ పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో పిఠాపురంలోని శ్రీశివ సాయి అగ్రో ఇన్‌పుట్స్‌ ఎరువుల దుకాణాం తనిఖీ చేశారు. అక్కడ స్టాక్‌ రిజిష్టర్లు సక్రమంగా లేకపోవడం, నిల్వల్లో వ్యత్యాసాలు గుర్తించి రూ3,94,382 విలువగల 16.125 మెట్రిక్‌ టన్నుల ఎరువులను ఇన్స్‌పెక్టర్‌ సత్యకిషోర్‌ సీజ్‌ చేశారు. ఈ తనిఖీల్లో జియాలజిస్ట్‌ లక్ష్మీనారాయణ, కానిస్టేబుల్‌ పాల్గొన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అమలాపురంలోని శివశక్తి ఎంటర్‌ప్రైజెస్‌ ఎరువుల దుకాణాన్ని ఇన్స్‌పెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి వలీ తనిఖీ లు చేశారు. ఈ షాపులో స్టాక్‌ నిల్వల్లో వ్యత్యా సం, గరిష్ట అమ్మకం ధర కన్నా ఎక్కువ ధరలకు అమ్మడం గుర్తించి ఆ షాపుపై సెక్షన్‌ 6ఎ కింద కేసు నమోదు చేశారు. అలాగే రూ.71,671 విలువ గల సుమారు 2,645 మెట్రిక్‌ టన్నుల ఎరువులను సీజ్‌ చేశారు. లీగల్‌ అండ్‌ మెట్రాలజీ అధికారులు ఒక కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-02-04T01:15:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising