ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు పర్యటనకు బ్రహ్మరథం

ABN, First Publish Date - 2023-02-16T01:38:44+05:30

వందల్లో కార్లు.. వేలల్లో బైక్‌ లు.. అడుగడుగునా హారతులు.. పూలవర్షాలు.. అడుగు తీసి అడుగేస్తే వేలాది జనం వెరసి టీడీపీ అధి నేత జిల్లా పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీగా తరలివచ్చిన వచ్చిన అశేష జనంతో జగ్గం పేట పర్యటన తొలిరోజు విజయవంతమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ (ఆంధ్రజ్యోతి)/ జగ్గంపేట/ జగ్గంపేట రూరల్‌, ఫిబ్రవరి 15 : వందల్లో కార్లు.. వేలల్లో బైక్‌ లు.. అడుగడుగునా హారతులు.. పూలవర్షాలు.. అడుగు తీసి అడుగేస్తే వేలాది జనం వెరసి టీడీపీ అధి నేత జిల్లా పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీగా తరలివచ్చిన వచ్చిన అశేష జనంతో జగ్గం పేట పర్యటన తొలిరోజు విజయవంతమైంది. బుధవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం విమానా శ్రయం నుంచి గోకవరం, అక్కడి రాత్రి జగ్గంపేట బహిరంగ సభ వద్దకు వచ్చే వరకు పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు చంద్రబాబు వెనుకే ఉన్నారు. కాకినాడ నుంచి పార్టీ సీనియర్‌ నేత గుణ్ణం చంద్ర మౌళి ఆధ్వర్యంలో భారీగా కార్ల ర్యాలీతో విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికారు. జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు పావని ఆధ్వర్యంలో చంద్రబాబును ఎయిర్‌పోర్టు లాంజ్‌లో కలిసి స్వాగతం పలి కారు. అలాగే పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప, పిఠాపురం, కాకినాడ మాజీ ఎమ్మెల్యేలు వర్మ, కొండబాబు, ప్రత్తిపాడు ఇన్‌చార్జి వరుపుల రాజా తదితరులు ఎయిర్‌పోర్టులో చంద్రబాబు ను కలిసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి పార్టీ నేతలు, వేలాది మంది కార్య కర్తలతో కలిసి రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు గోకవరం, అక్కడి నుంచి జగ్గంపేట ప్రయాణించారు. ఎక్కడికక్కడ జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తొలుత విమానాశ్రయంలో పార్టీ నేతలు గజమాలలతో చంద్రబాబును స్వాగ తించగా, జగ్గంపేట మండలం మల్లిశాల వచ్చేసరికి ప్రజలు, కార్యకర్తలు పూల హారతులు పట్టారు. చంద్రబాబు రాక కొంత ఆలస్యం అయినా వేలల్లో జనం వేచి ఉన్నారు. మల్లిశాల తర్వాత వెంగాయపురం, రాజపూడి గ్రామాల మీదుగా బాబు పర్యటన సాగింది. రాజపూడి, జగ్గంపేటలలో ఎన్టీఆర్‌ విగ్రహాల ప్రారం భం అనుకున్నా కోడ్‌ నేపథ్యంలో ప్రారంభించలేదు. ఆ తర్వాత రాత్రి 8.30 గంటలకు జగ్గంపేట బహిరంగ సభ వద్దకు వచ్చిన చంద్రబాబు ఉత్సాహంగా గంటపాటు ప్రసంగించారు. జిల్లాలో పుష్కర, ఏలేరు, పురుషోత్తపట్నం ఫేజ్‌2 కట్టించిన ఘనత టీడీపీదేనన్నారు. జిల్లాలో ఎక్కడికక్కడ రహదారులు టీడీపీ హయాంలోనే వచ్చాయని వివరించారు. ఆ తర్వాత చంద్రబాబు తన ప్రసం గంలో జగ్గంపేట ఎమ్మెల్యే అవినీతి చిట్టా విప్పడంతో జనం హర్షధ్వానాలు ప్రక టించారు. రామేశంమెట్టలో వందల ఎకరాలను ఎమ్మెల్యే మింగేసి అనకొండగా మారారన్నప్పుడు జనం చప్పట్లు కొట్టారు. జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు అమాయకుడు అనుకుంటే పెద్ద ఘనుడే అని విమర్శించారు. ఇర్రిపాకలో వందె కరాలు, మరోచోట 549 ఎకరాల్లో చేపల చెరువులను ఎమ్మెల్యే చెరబట్టాడని ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాల్లోను ఎకరాకు రూ.24 లక్షల కమీషన్‌ కొట్టేశాడన్నారు. కాగా టీడీపీ అధికారంలోకి వచ్చాక జగ్గంపేటకు కార్పొరేట్‌ స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి, గోకవరం, కిర్లంపూడిలలో డిగ్రీ కాలేజీలు కొత్తవి మంజూరు చేస్తా మని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోపక్క చంద్రబాబు జగ్గంపేట సభ ప్రారంభానికి ముందు మాజీ ఎమ్మెల్యే నెహ్రూ, ముఖ్య నేతలు ప్రసంగించారు. టీడీపీతోనే రాష్ట్రానికి శుభకరం అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2023-02-16T01:38:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising