సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని నిరసన దీక్ష
ABN, First Publish Date - 2023-06-07T01:00:05+05:30
జనావాసాల మధ్యలో సెల్ టవర్ ఏర్పాటుపై ప్రజలు మండిపడుతున్నారు.
ఆత్రేయపురం. జూన్ 6: జనావాసాల మధ్యలో సెల్ టవర్ ఏర్పాటుపై ప్రజలు మండిపడుతున్నారు. తమ అభిప్రాయాలను లెక్కచేయకుండా సెల్ టవర్ నిర్మాణానికి పంచాయతీ అనుమతి ఇవ్వడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు. నార్కెడిమిల్లి గంటాలమ్మ గుడి సమీపంలో టవర్ నిర్మిస్తున్న ప్రాంతంలో ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతి రద్దు చేయాలని, టవర్ నిర్మాణం నిలుపుదల చేయాలని నినాదాలు చేశారు. ఆకుల రమణ, వంగలపూడి సూరిబాబు, కోపెల్ల శ్రీరామ్, రాంబాబు, ఆకుల భ్రమరాంబ, ప్రభావతి పాల్గొన్నారు.
Updated Date - 2023-06-07T01:00:05+05:30 IST