ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివ్యాంగులకు బస్‌ పాస్‌లు

ABN, First Publish Date - 2023-03-05T00:52:07+05:30

దివ్యాంగులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మూడేళ్ల కాల పరిమితితో ఆర్టీసీ బస్‌ పాస్‌లు జారీ చేస్తోంది. మూడేళ్ల క్రితం బస్‌పాస్‌లు పొందిన దివ్యాంగులు వాటిని రెన్యువల్‌ చేసుకోవడంతో పాటు కొత్తగా పాస్‌లు పొందా లనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ప్రజా రవాణాధికారి ఆర్వీఎస్‌ నాగే శ్వరరావు కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమలాపురం రూరల్‌, మార్చి 4: దివ్యాంగులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మూడేళ్ల కాల పరిమితితో ఆర్టీసీ బస్‌ పాస్‌లు జారీ చేస్తోంది. మూడేళ్ల క్రితం బస్‌పాస్‌లు పొందిన దివ్యాంగులు వాటిని రెన్యువల్‌ చేసుకోవడంతో పాటు కొత్తగా పాస్‌లు పొందా లనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ప్రజా రవాణాధికారి ఆర్వీఎస్‌ నాగే శ్వరరావు కోరారు. బస్‌పాస్‌లు పొందాలనుకునే దివ్యాంగులు పాస్‌ పోర్టు సైజు ఫొటోతో పాటు రూ.100 చెల్లించాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వలంటీర్లు సచివాలయ సిబ్బంది సహకారంతో దివ్యాంగులందరికీ బస్‌పాస్‌లు నేరుగా అందించే విధంగా చర్యలు తీసుకున్నాం. దివ్యాంగులెవరూ బస్‌పాస్‌ల కోసం ఆర్టీసీ డిపోల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పల్లెవెలుగు బస్సులకు మాత్రమే పరిమితం కాకుండా ఎక్స్‌ప్రెస్‌, ఆల్ర్టాడీలక్స్‌ బస్సుల్లో సగం ధరకే దివ్యాంగులు ప్రయాణం చేయవచ్చు. దివ్యాంగ పెన్షన్‌ పొందుతున్నవారి జాబితాల ఆధారంగా సచివాలయాల వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి బస్‌ పాసులు అందిస్తాం. వలంటీర్లకు సంబంధిత వివరాలను దివ్యాంగులు అందిస్తే చాలు. జిల్లా వ్యాప్తంగా సుమారు 20వేల మంది దివ్యాంగులకు ఈ బస్‌ పాసులతో లబ్ధి చేకూరుతుంది. నూరుశాతం దివ్యాంగులకు, అంధులకు ఆర్టీసీ ప్రయాణాల్లో ప్రత్యేక రాయితీలు ఉన్నాయి. అటువంటి వారికి సహాయకులుగా వచ్చే వారికి కూడా సగం ధరతోనే టిక్కెట్లు తీసుకోవడం జరుగుతుంది. జిల్లాలోని దివ్యాంగులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం సెల్‌ 9676266777 సంప్రదించాలన్నారు.

Updated Date - 2023-03-05T00:52:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising