‘భోగాది’ది చదివించే శైలి
ABN, First Publish Date - 2023-04-03T01:26:15+05:30
సీనియర్ జర్నలిస్ట్ భోగాది వేంకటరాయుడు రచనా శైలి చదివించేదిగా ఉంటుంది. ఆయన ఇంకా రాయాలని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గన్నీస్ ఫంక్షన్‌హాల్ శుభమస్త్‌లో ఆదివారం జరిగిన సీనియర్ జర్నలిస్ట్ భోగాది వెంకట్రాయుడు రాసిన మనలో మాట పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు.రాయుడు రాష్ట్ర విభజన గురించి బాగా రాశారు.
మనలో మాట పుస్తకావిష్కరణ సభలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్‌ఙ
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి) : సీనియర్ జర్నలిస్ట్ భోగాది వేంకటరాయుడు రచనా శైలి చదివించేదిగా ఉంటుంది. ఆయన ఇంకా రాయాలని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గన్నీస్ ఫంక్షన్‌హాల్ శుభమస్త్‌లో ఆదివారం జరిగిన సీనియర్ జర్నలిస్ట్ భోగాది వెంకట్రాయుడు రాసిన మనలో మాట పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు.రాయుడు రాష్ట్ర విభజన గురించి బాగా రాశారు. ఆంధ్ర, రాయలసీమ అభివృద్దిని, రాజకీయ అభివృద్దిని కూడా ప్రస్తావించారన్నారు. అపురూపమైన పాత్రికేయతరం ముగిసిపోతుందేమో, వృత్తి నుంచి నిష్క్రమిస్తుందేమో అనిపిస్తుంది. ఎవరి గురించి రాసినా, ఏది రాసినా ఏదో శిబిరానికి అంటగడుతుండడంతో రాయడం కష్టమవుతుందని విశ్లేషించారు. రాజకీయాల్లో శ్రేణులు, వర్గాలు ఉంటాయి. అయినా అప్రియమైన విషయాలను సమాజం అంగీకరించే భాషలో రాయాలన్నారు. మాజీ ఎంపీ ఉండవలి అరుణకుమార్ మాట్లాడుతూ నోటికొచ్చినట్టు మాట్లాడేవాడు రాజకీయాలకు పనిచేయడన్నారు. ఇవాళ పెద్దనాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మంత్రులు మనస్సు మీద కంట్రోలు తప్పారు. ఏదో మాట్లాడేవారు రాజకీయనేతలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీగా వస్తే ప్రజలు నమ్ముతారు. ఇవాళ నీతిపరుడెవరు, అవినీతి పరుడెవరు అనుమానంలో ఉన్న ప్రజలు వీడు కాకపోతే, వాడన్నట్టు ఎవడో ఒకడికి ఓటేస్తున్నారని తెలిపారు. సీబీఐ మాజీ జేడీ వీవీ.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భక్తుడిగా వ్యక్తిగతంగా పూజ చేసుకోవచ్చు. కానీ రాజకీయాల్లో వ్యక్తిగత పూజ ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరమన్నారు.కవులు,రచయితలు ఎన్నుకోబడని ప్రజాప్రతినిధులని బీబీసెర్లీ అన్నారని, జాషువా, దాశరథి వంటి వారు కూడా ఇలానే చెప్పారని తెలిపారు. ఈ సమావేశంలో టీడీఙపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, జర్నలిస్ట్‌లు కృష్ణకుమార్, విక్రమ్‌పూలే, డి.సోమసుందర్, ఎం.శ్రీరామమూర్తి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-04-03T01:26:15+05:30 IST