ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అరాచక ప్రభుత్వం ఇది: పురందేశ్వరి

ABN, First Publish Date - 2023-06-21T01:08:43+05:30

ఆంధ్ర రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజమెత్తారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో జరిగిన బీజేపీ తొమ్మిదేళ్ల పాలన మహోత్సవ సభకు జిల్లా అధ్యక్షుడు కర్రి చిట్టిబాబు అధ్యక్షత వహించగా ఆమె పాల్గొని మాట్లాడారు.

మాట్లాడుతున్న పురందేశ్వరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పి.గన్నవరం, జూన్‌ 20: ఆంధ్ర రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం రాజ్యమేలుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజమెత్తారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో జరిగిన బీజేపీ తొమ్మిదేళ్ల పాలన మహోత్సవ సభకు జిల్లా అధ్యక్షుడు కర్రి చిట్టిబాబు అధ్యక్షత వహించగా ఆమె పాల్గొని మాట్లాడారు. దిశ యాప్‌ను ప్రవేశపెట్టామని సెల్‌ఫోన్‌ను గిరా గిరా తిప్పితే పోలీసులు రక్షణ కల్పిస్తారని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం మహిళలకు, బాలికలకు రక్షణ కల్పించడంలో విఫలమైందని మండిపడ్డారు. సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఆడపిల్లకు అన్యాయం జరిగితే అడిగే దిక్కులేదన్నారు. విశాఖలో ఒక ఎంపీ కుటుంబంపై దుండగులు వ్యవహరించిన తీరు చూస్తుంటే రాష్ట్రంలో సామాన్యులు పరిస్థితి ఏమిటని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.1100 కోట్లు నిధులు విడుదల చేస్తే...రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా చెల్లించాల్సిన రూ.358 కోట్లుకు గాను కేవలం రూ.2 కోట్లే కేటాయించిందని దుయ్యబట్టారు. ఇలాగైతే ఈ ప్రాంత వాసుల 20 ఏళ్ల కల ఎప్పుడు నెరవేరుతుందన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం సొంతపేర్లతో పఽథకాలను ప్రవేశపెడుతుందని ఎద్దేవా చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులను దుర్వినియోగపరిచి పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత ఏపీకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో సహజ సిద్ధంగా లభించే ప్రకృతి సంపదలను దోచుకుంటున్నారని తద్వారా ఉపాధి రంగాలను దెబ్బతీస్తున్నారని విమర్శలు గుప్పించారు. మాఫియా కనుసన్నల్లో నిత్యం ఎంతమేర ఇసుక దోపిడీ జరుగుతుందో చూస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు కేటాయిస్తుందని ఒక లారీ ఇసుక కొనుగోలు చేయాలంటే లారీకి రూ.30 వేలు హెచ్చించాల్సిందేనన్నారు. ఇలాగైతే సామాన్యుడు ఇల్లు ఎలా నిర్మించుకుంటాడని పురందేశ్వరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Updated Date - 2023-06-21T01:08:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising