ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీరు ధరలు..బార్‌లా!

ABN, First Publish Date - 2023-06-04T01:03:14+05:30

బాదుడే బాదుడు’కు కాదేదీ అనర్హం అనే దారిలో పాలన సాగుతోంది. ఏ రకంగానైనా జనాన్ని దోచేసి ఖజానా నింపుకోవడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కృత్రిమ కొరత సృష్టిస్తుండగా.. బార్లలో బీర్‌ల ధరకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.

బీర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బార్ల యజమానులదే ఽధర నిర్ణయం

ధర మీ ఇష్టమని వదిలేసిన సర్కారు

పెద్ద బీరు రూ.400.. చిన్నది రూ.200

నాడు రూ.120.. రూ.70 మాత్రమే

ప్రభుత్వ దుకాణాల్లో కృత్రిమ కొరత

నెలకు బీర్లపై రూ.2కోట్లు

నష్టపోతున్న మద్యపానప్రియులు

(రాజమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)

‘బాదుడే బాదుడు’కు కాదేదీ అనర్హం అనే దారిలో పాలన సాగుతోంది. ఏ రకంగానైనా జనాన్ని దోచేసి ఖజానా నింపుకోవడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కృత్రిమ కొరత సృష్టిస్తుండగా.. బార్లలో బీర్‌ల ధరకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.అందరూ ‘ఏకమై’ ఇష్టా నుసారం మద్యపాన ప్రియుల జేబులకు పెద్ద కన్నం వేస్తున్నారు. వేసవి కావడంతో బీర్‌లకు బాగా గిరాకీ ఉంటుంది. దీంతో ఎంఆర్‌పీకి రెక్కలొచ్చేశాయి. ఇష్టాను సారం ధరలు పిండెయ్యొచ్చని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసినందువల్ల అంతా మా ఇష్టం అనే ధోర ణిలో బార్లు నడుస్తున్నాయి. నియంత్రణ లేని ధరల తీరు చూసి జనం మండిపడుతున్నారు. గత ప్రభు త్వంలో పది బీర్లు కొంటే రూ.1,200 అయ్యేది, ఇప్పుడు రూ.3,300 నుంచి రూ.4 వేలు అవుతోంది. బీరు రూ.330-400కి అమ్మడం బహుశా ఇదే తొలిసారేమో!

ఒక్కో బీరుపై రూ.150 అదనం

జిల్లాలో 21 బార్లు ఉంటే రాజమహేంద్రవరంలోనే 17 ఉన్నాయి. సిండికేట్‌ కావడంతో ధరలు సొంతంగా నిర్ణయించుకుని విక్రయిస్తున్నారు.బార్లలో ఒక్కో బీరుపై ఎమ్మార్పీపై రూ.60-70 ఎక్కువగా తీసుకునే వాళ్లు. తర్వాత వాళ్లకు వాళ్లే మళ్లీ రేట్లు పెంచేసుకు న్నారు. 20 రోజుల నుంచీ రూ.100-150 అదనంగా లాగేస్తున్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర ఎంఆర్‌పీ ఎక్కువ. దానికితోడు ఇష్టానుసారం గుం జేస్తుండడంతో మందుబాబులు గొల్లుమంటున్నారు. ఈ సీజన్‌లో బార్లలో రోజుకు సరాసరి 20 కేసుల బీర్లు అమ్ముడ వుతున్నాయి. ఒక్కో కేసులో 12 బీర్లు ఉంటాయి. అంటే ఒక్కో బారులో రోజుకు 240-300 బీర్లు విక్ర యిస్తారు. ఈ లెక్కన రోజుకు ఒక్కో బారులో కనీసం రూ.25-40 వేలు బీరు ప్రియుల జేబులకు చిల్లు పడుతోంది. జిల్లా లోని 21 బార్లను లెక్కలోకి తీసుకుంటే రూ.6 లక్షల పైమాటే. నెలకు సుమారు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్లకుపైగా బీర్లపై ‘అధనం’గా దోచేస్తున్నారు.

బార్లలో బీర్లు ఫుల్‌..

బార్లలో బీర్లు ఫుల్‌గా దొరుకుతున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మాత్రం కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. జిల్లాలోని 137 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. బార్లకు రోజుకు 30-50 కేసులు వేస్తుండగా..ప్రభుత్వ మద్యం దుకాణాలకు మాత్రం 3-4 కేసులు విధిలిస్తు న్నట్టు తెలుస్తోంది. గ్రామాల్లో కేఎఫ్‌ అందుబాటులో ఉండకపోగా ఉన్న వాటిని రూ.350-370 పెట్టి కొను క్కోవాల్సిందే. బడ్వైజర్‌ వంటి బీరు తయారీదారులు రాష్ట్రంలో మద్యంపాలసీ చూసి అమ్మకాలు సాగించ డానికి ససేమిరా అంటున్నారట.జగన్‌ బ్రాండ్ల మాయ ను తట్టుకోలేక బీరుతాగేవాళ్లు ఎక్కువగా ఇష్టపడే నాకవుట్‌, ఖజురహో వంటి బీర్లు నాలుగేళ్ల నుంచీ కనుమరుగైపోయాయి.

నాడు అలా.. నేడు ఇలా..

గత ప్రభుత్వంలో మద్యం పాలసీ ఇలా లేదు. టెం డర్ల ద్వారా కేటాయించేవాళ్లు. ఎంఆర్‌పీకే అమ్మేవారు. నేడు ప్రభుత్వం ఎన్నిదారుల్లో వీలైతే అన్నిదారుల్లో మద్యం విక్రయిస్తోంది.ఎంఆర్‌పీపై బీరుకు రూ.3-5 ఎక్కువగా చెల్లించి బార్లు కొంటున్నాయి.బార్లకు క మీ షన్‌ తీసిపారేసిన ప్రభుత్వం ఎంతకైనా అమ్ముకోవ చ్చని ఆదేశాలిచ్చింది.జనం జేబులు గుల్లకావడానికి బా ధ్యతా రహితంగా ఇచ్చిన ఆ ఆదేశాలే ప్రధాన కార ణ మవుతున్నాయి.ఈ విధానం రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. రాష్ట్రంలోని మద్యం పాలసీ దేశంలో ఎక్కడా కనబడదు.

ప్రభుత్వ పాలసీతో ఇబ్బందే..

వేసవిలో బీర్ల కొరత ఉండడం మామూలే. అయితే, ఈసారి ఉన్నంత కొరత ఎప్పుడూ లేదు. ఇప్పుడున్నంత ధరలు ఎన్నడూ లేవు. ఈ మూడేళ్ల నుంచీ కొత్త బ్రాం డ్లు వచ్చినా కొరత ఎందుకొస్తుందనే ప్రశ్నకు సమా ధానం లేదు. అయితే ప్రభుత్వ మద్యం పాలసీ కూడా బీర్ల తీవ్ర కొరతకు తెరవెనుక కారణంగా కనిపిస్తోంది. గతంలో తాగడానికి పర్మిట్‌ రూమ్‌లు ఉండేవి. తాగిన తర్వాత ఖాళీ సీసాలు పర్మిట్‌ రూమ్‌లలో పడేసేవాళ్లు. అవి మళ్లీ వెనక్కి కంపెనీకి వెళ్లడంతో ఖాళీ సీసాల కొరత ఉండేది కాదు. ఈ ప్రభుత్వం వచ్చాక పర్మిట్‌ రూమ్‌లు లేవు.జిల్లాలో 21 బార్లు, 137 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 7 వాక్‌ఇన్‌సోర్లు ఉండగా.. బెల్టు షాపులకు లెక్కలేదు.బార్లలో వందలకు వందలు ఎక్కువ చెల్లిం చలేక ఎక్కడపడితే అక్కడ తాగేస్తున్నారు. ఇలా ఖాళీ సీసాలు చెల్లాచెదురైపోతున్నాయి. తిరిగి కంపెనీలకు చేరడం లేదు.సీసా తయారీ గాజు ధర కూడా సుమారు 200శాతం పెరిగిపోయింది.గతంలో ఒక ఖాళీ సీసా బీరు తయారీ వాళ్లకు రూ.12-17పడితే ఇప్పుడు రూ.35- 37కి పెరిగింది.ఖాళీ సీసాలు కొనడం లాభంపై ప్రభా వం చూపడంతో బీరు తయారీ తగ్గిందని చెబుతు న్నారు.పలు మద్యం తయారీదారులు గాజు సీసాలను వదిలేసి ప్లాస్టిక్‌ సీసాల్లోకి దిగిపోయారు.

Updated Date - 2023-06-04T01:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising