ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘సత్రం భూములు వేలంపాట వేయాలి’

ABN, First Publish Date - 2023-08-22T01:17:24+05:30

బొమ్మూరు (రాజమహేంద్రవరం) ఆగస్టు 21: మెట్ట ప్రాంతంలోని 37 ఎకరాల సుందరమ్మ సత్రం భూముల వేలంపాట నిర్వహించాలని కోరుతూ రైతు కూలీలు, ఏపీ రైతు కూలీసంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మా ట్లాడుతూ అధికారుల సమక్షంలో 21 ఎకరాల భూమిని కొందరు వేలం ద్వారా పాడుకున్నప్పటికీ వారు డబ్బులు కట్టకుండా రాజకీయ ఒత్తిడితో భూములను విడిచిపెట్టడం లేద

కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న రంపఎర్రంపాలెం గ్రామస్తులు

బొమ్మూరు (రాజమహేంద్రవరం) ఆగస్టు 21: మెట్ట ప్రాంతంలోని 37 ఎకరాల సుందరమ్మ సత్రం భూముల వేలంపాట నిర్వహించాలని కోరుతూ రైతు కూలీలు, ఏపీ రైతు కూలీసంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మా ట్లాడుతూ అధికారుల సమక్షంలో 21 ఎకరాల భూమిని కొందరు వేలం ద్వారా పాడుకున్నప్పటికీ వారు డబ్బులు కట్టకుండా రాజకీయ ఒత్తిడితో భూములను విడిచిపెట్టడం లేదన్నారు. పాడుకున్న రోజే డబ్బు చెల్లించకుండా వెళ్లిపోయారని, ఆ భూములకు వేలంపాట నిర్వహించడంలో ఎండోమెంట్‌ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని వాపో యారు. అలాగే ఇదివరకు పాటలో పెట్టని 16 ఎకరాలు, వేలంపాటలోని 21 ఎకరాలకు కలిపి పాట నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ వద్ద రెండుగంటలపాటు నిరసన తెలిపారు. తర్వాత కలెక్టర్‌ మాధవీలతను కలిసి వినతిపత్రం అందజేశారు. సత్రం భూములపై తగిన న్యాయం చేయాలని కోరారు. నిరసనలో సంఘం కార్యదర్శి దుర్గారావు, డివిజన్‌ కార్యదర్శి సురేష్‌, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T01:17:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising