ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రత్నగిరిపై మూలవరులకు లక్ష చామంతుల పూజ

ABN, First Publish Date - 2023-02-19T01:55:50+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో శనివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మూలవరులకు వేకువజామున మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలతో పాటుగా దాతతో ప్రధానాలయంలో లక్షచామంతులతో ప్రత్యేకపూజలు నిర్వహించారు.

గర్భాలయం వెలుపల కుర్చీలో కూర్చున్న వృద్ధురాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నవరం, ఫిబ్రవరి 18: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో శనివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మూలవరులకు వేకువజామున మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలతో పాటుగా దాతతో ప్రధానాలయంలో లక్షచామంతులతో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు స్వామి,అమ్మవార్లను శంకరులను దర్శించారు. రాత్రి 12గంటలకు లింగోద్భవకాలంలో పరమేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

వివాదాస్పదమైన ఆలయ అధికారుల చర్య

దాత సహాయంతో ప్రధానాలయంలో లక్షచామంతుల పూజ జరుగుతున్న సమయంలో దాత బంధువులకు చెందిన పెద్దావిడను కుర్చీలో కూర్చోబెట్టడం వివాదాస్పదమైంది. దీనిపై అధికారులు మాత్రం గర్భాలయంలో కూర్చోబెట్టలేదని గర్భాలయం బయట ఆమె వయస్సురీత్యా కీళ్లనొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలు కారణంగా కుర్చీలో బయట కూర్చోబెట్టినట్లు తెలిపారు.

వేడుకగా ప్రాకారసేవ

రత్నగిరివాసుడైన సత్యదేవుడికి శనివారం ప్రాకారసేవ అత్యంత వేడుకగా జరిగింది. ఉదయం 10గంటలకు స్వామి,అమ్మవార్లను తిరుచ్చిపై ఆశీనులు గావించి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ తూర్పురాజగోపురం చుట్టూ ముమ్మా రు ప్రదక్షణ గావించారు. హారతులిచ్చి తిరిగి ప్రధానాలయానికి తీసుకుని వెళ్లారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-02-19T01:55:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising