ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగన్వాడీ ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2023-06-07T00:49:38+05:30

కొవ్వూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయాల పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు సీడీపీవో డి.మమ్మీ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, జూన్‌ 6: కొవ్వూరు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయాల పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు సీడీపీవో డి.మమ్మీ తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని కొవ్వూరు మండలం కాపవరం-2, దొమ్మేరు-2, కుమారదేవం-1, దొమ్మేరు-4, కొవ్వూరుటౌన్‌ 10వ వార్డు తాయారమ్మ స్కూల్‌ సెంటర్‌, తాళ్లపూడి మండలం పెద్దేవం-1, చాగల్లు మండలం చిక్కాల-1, చాగల్లు-9 కేంద్రాల్లో ఖాళీగానున్న ఆయా పోస్టులకు స్థానిక వివాహిత మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన 21 నుంచి 35 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులని చెప్పారు. దరఖాస్తులను జూన్‌ 5వ తేదీ నుంచి జూన్‌ 13వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు కొవ్వూరు ఐసీడీఎస్‌ కార్యాలయంలో అందజేయాలన్నారు. ప్రీస్కూల్‌ శిక్షణ పొందిన అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాన్ని దరఖాస్తుతో జతపర్చాలన్నారు.

  • గోపాలపురంలో...

ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న కార్యకర్త, సహాయకురాలు పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారి సుందరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అర్హత గల అభ్యర్థినిలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అందులో భాగంగా ఆవపాడు బీసీ ఏ, సాగిపాడులో బీసీ బీ, త్యాజంపూడి ఓపెన్‌, యర్నగూడెం ఎస్సీ, నల్లజర్ల ఓపెన్‌, ఎస్సీ, గుడ్డిగూడెం బీసీ డీ, స్థానిక వివాహిత మహిళలు అయి ఉండి 21 సంవత్సరాల నుంచి 35సంవత్సరాల లోపు వారై ఉండి, కనీసం 10వ తరగతి పాసై ఉండాలన్నారు. దివ్యాంగులకు తక్కువ పర్శంటేజ్‌ ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని 13వ తేదీ సాయంత్ర 5గంటల స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయంలో దరఖాస్తులు నమోదు చేసుకోవాలన్నారు.

Updated Date - 2023-06-07T00:49:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising