ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనులు చకచకా.. భూమి కావాలిక!

ABN, First Publish Date - 2023-02-25T23:59:16+05:30

రాజమహేంద్రవరం- కాకినాడ సిటీ, కాకినాడ పోర్టుకు అత్యంత ప్రధానమైన రాజానగరం - సామర్లకోడ్లు విస్తరణ పనులకు గ్రహణం వీడడంలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో ఈ రోడ్డును ఫోర్‌లేన్‌గా విస్తరించడానికి సుమారు రూ.290 కోట్లతో 30 కిలోమీటర్ల నిర్మించడానికి కాంట్రాక్టు సంస్థను ఖరారు చేశా రు.

సాగుతున్న ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోడ్డు నిర్మాణంపై అయోమయం?

టీడీపీ హయాంలో మొదలు

రూ.290 కోట్లతో 2017లో పనులు ఆరంభం

వైసీపీ ప్రభుత్వ వైఖరితో కొంతకాలం నిలిపివేత

ఇంత వరకూ 40 శాతం పనులు.. రూ.90 కోట్ల ఖర్చు

ఇంకా రూ.30 కోట్ల బిల్లులు పెండింగ్‌

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

రాజమహేంద్రవరం- కాకినాడ సిటీ, కాకినాడ పోర్టుకు అత్యంత ప్రధానమైన రాజానగరం - సామర్లకోడ్లు విస్తరణ పనులకు గ్రహణం వీడడంలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో ఈ రోడ్డును ఫోర్‌లేన్‌గా విస్తరించడానికి సుమారు రూ.290 కోట్లతో 30 కిలోమీటర్ల నిర్మించడానికి కాంట్రాక్టు సంస్థను ఖరారు చేశా రు. చాలా వరకూ భూసేకరణ కూడా చేసి, చెట్లు తొలగించి, విస్తరణ పనులుచేపట్టారు. తర్వాత ప్రభు త్వం మారి, వైసీపీ అధికారంలోకి రావడంతో చాలా కాలం ఈ పనులు ఆపేశారు. తర్వాత అదే కాంట్ర్టాక్టర్‌ను కొనసాగించినా రూ.కోట్ల బిల్లులు పెండింగ్‌ ఉండ డంతో కొద్దిరోజుల కిందట వరకూ పనులు స్పీడందుకోలేదు. ఇటీవల కొన్ని బిల్లులు ఇవ్వడానికి నిర్ణయించడంతో పాటు.. పనులు వేగంపుంజుకున్నాయి. కానీ ఇంకా భూసేకరణకు సంబంఽధించి, రంగంపేట, రాజానగరం ప్రాంతాల్లో కోర్టులో కేసులు ఉండడంతో ఈ రోడ్డు నిర్మాణంపై అయోమయం నెలకొంది.

ఐదేళ్లగా పనులు సా..గుతున్నాయి..

పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఏడీబీ రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు.గతంలో డబుల్‌ లేన్‌ రోడ్డు ఉంది. రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వెళ్లడానికి దగ్గర దారి. పైగా కాకినాడ పోర్టుకు వెళ్లే వాహనాలకు ఇది అనువైనదారి. ఈ రోడ్డులో ట్రాఫిక్‌ ఎ క్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రాజానగరం హైవే నుంచి సామర్లకోట వరకూ విస్తరించడానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. 30 కిలోమీటర్ల మేర రూ.రూ.290 కోట్లతో నిర్మించడానికి నిర్ణయించింది. రాజానగరం హైవేలో ట్రంపెట్‌ బ్రిడ్జి నిర్మాణానికి ఎప్పుడో శంకుస్థాపన చేశారు. పనులు సవ్యంగా ప్రారంభమయ్యాయనే సమయంలో ప్రభుత్వం మారిం ది. వైసీపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ విధానం తెచ్చి కొన్ని పనులు ఆపేసింది. మళ్లీ ప్రభుత్వం అంగీకరించినా బిల్లులు పెండింగ్‌తో పనులు సక్రమంగా జరగలేదు. ఇటీవల రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. 30 కిలోమీటర్ల రోడ్డు పనుల్లో రాజానగరం, రామేశ్వరంపేట వద్ద ఫ్లైవోవర్లు, మూడు ప్రధాన బ్రిడ్జిలు, సుమారు 45 వరకూ కల్వర్టులు నిర్మించాల్సి ఉంది. అధికారులు కథనం ప్రకారం ఇప్పటికి 40 శాతం పనులు పూర్తయ్యాయి. సుమారు రూ.90 కోట్లు ఖర్చ యింది. ఇంకా కాంట్రాక్టర్‌కు సుమారు రూ.30 కోట్లు బిల్లులు రావాల్సి ఉంది. ఇటీవల రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ డీసీ) అధికారుల కథనం ప్రకారం సుమారు రూ.11 కోట్ల వరకూ బిల్లులు రానున్నాయి.ఎన్నికలు సుమారు ఏడాదికాలంలో రానుండడంతో ఈ పనులు ఏదో విధంగా చేస్తారనే ప్రచారం ఉందీ. కానీ వాస్తవంగా అనేక సమస్యలు ఉన్నాయి.ప్రస్తుతం భూమి సమస్య లేని చోట రోడ్డు విస్తరణ పనులు జూన్‌ నెలాఖరికి పూర్తవుతాయని ఆర్‌డీసీ అధికారులు చెబుతున్నారు.

రంగంపేటలో భూసేకరణ సమస్య

రంగంపేట మండలంలో సుమారు 5 కిలోమీటర్ల మేర భూసేకరణ సమస్య ఉంది. గతంలో రెవెన్యూ అధికారులు నిర్ణయించిన నష్ట పరిహారం కంటే ఎ క్కువ ఇవ్వాలని భూ యజమానులు డిమాండ్‌ చేస్తూ కోర్టుకు వెళ్లారు. సుమారు 4 ముఖ్యమైన కేసులు కోర్టులో ఉన్నాయి. వాటిని పరిష్కరించి, నిధుల కొరత లేకుండా చూడగలిగితే పనులు త్వరగా ముందుకు కదులుతాయి. రెవెన్యూ అఽధికారులు దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాల్సి ఉంది.

రామేశ్వరంపేట వద్ద ఆక్రమణలు

రామేశ్వరం పేట గ్రామం వద్ద ఫ్లైవోవర్‌ నిర్మాణానికి కొన్ని ఆక్రమణలు ఉన్నాయి. వీటి తొలగింపునకు ప్రజలు సహకరిస్తేనే పనులు చేయగలుగుతామని, లేకపోతే సమస్య ఉంటుందని అధికారులు చెబుతున్నారు.రోడ్డు పక్క ఆక్రమణలు,సొంతవి కూడా ఉన్నా యి. ప్రజలు మాత్రం నష్టపరిహారం కోరుతున్నారు.

రాజానగరం ట్రంపెట్‌కూ భూ సమస్య

రాజానగరం హైవేపై ఏడీబీరోడ్డు మొదలయ్యే చోట ట్రంపెట్‌ నిర్మించాల్సి ఉంది. హైవేలో రాజమహేంద్రవరం నుంచి ఇక్కడ సుమారు రౌండ్‌గా ఈ ట్రంపెట్‌ నిర్మిస్తారు. వాహనాలు పైకి ఎక్కి, నాలుగు వైపులకు దిగేటట్టు ఉంటుంది. దీనికి ఒక వైపు భూసేకరణ సమస్య ఉంది. ఇది ఇప్పట్లో పరిష్కారమయ్యేటట్టు కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏడీబీ రోడ్డు పనులు వేగంగా సాగుతున్నా భూసేకరణ సమస్య తీరితేనే నూరుశాతం పూర్తయ్యే అవకాశం ఉంటుంది.

Updated Date - 2023-02-25T23:59:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising