అడావుడి!
ABN, First Publish Date - 2023-03-21T01:31:35+05:30
అధికార వైసీపీలో ఎందరో ఆశావహులు పదవుల కోసం గత కొంతకాలంగా పైరవీలు చేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా పరిధిలో ఇటీవల ప్రభుత్వం ఏర్పాటుచేసిన అమలా పురం అర్బన్ డెవలెప్‌మెంట్ అథారిటీ చైర్మ న్ పదవి కోసం వైసీపీ నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో కొత్తపేటకు చెందిన దళిత నేత మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్‌రాజును అడా చైర్మన్ పదవి వరించే అవకాశం ఉం దన్న ప్రచారంతో ఆ పదవిపై ఆశలు పెంచుకున్న నేతలంతా హుటాహుటీన తాడే పల్లి బయలుదేరి వెళ్లడం
సామాజికవర్గాల కూర్పుతో అడా చైర్మన్ ఎంపిక
చైర్మన్‌గా కొత్తపేటకు చెందిన గొల్లపల్లి డేవిడ్‌రాజు పేరు ఖరారు?
ఆశావహుల్లో అసంతృప్తి జ్వాలలు
కాపులకు మొండిచెయ్యేనా
రాజుకుంటున్న రాజకీయం
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
అధికార వైసీపీలో ఎందరో ఆశావహులు పదవుల కోసం గత కొంతకాలంగా పైరవీలు చేస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా పరిధిలో ఇటీవల ప్రభుత్వం ఏర్పాటుచేసిన అమలా పురం అర్బన్ డెవలెప్‌మెంట్ అథారిటీ చైర్మ న్ పదవి కోసం వైసీపీ నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో కొత్తపేటకు చెందిన దళిత నేత మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్‌రాజును అడా చైర్మన్ పదవి వరించే అవకాశం ఉం దన్న ప్రచారంతో ఆ పదవిపై ఆశలు పెంచుకున్న నేతలంతా హుటాహుటీన తాడే పల్లి బయలుదేరి వెళ్లడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎస్సీ మాల సామాజికవర్గానికి చెందిన వ్యక్తికే అడా చైర్మన్ పదవి ఇవ్వాలంటూ కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వ రూప్‌తో సహా దళిత ప్రజాప్రతినిధులు డేవిడ్‌రాజు వైపు మొగ్గు చూపినట్టు సమా చారం. ఇటీవల వైసీపీలో చోటు చేసుకున్న సామాజికవర్గ సమీకరణలో భాగంగా శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి ఉభయ రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావును ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మె ల్సీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా మాదిగ సామాజికవర్గంలోని అల్లవ రం మండలం గోడి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బొమ్మి ఇజ్రాయిల్‌ను ఈ నెల 23న జరిగే ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నుకోనున్నారు. దాంతో వైసీ పీకి అండదండలుగా ఉన్న మాల సామాజిక నేతలు అడా చైర్మన్ పదవి మాల లకే కేటాయించాలనే ఒత్తిడి తీవ్రమైంది. దీనికితోడు కొత్తపేట నియోజకవర్గంలో చిర్ల జగ్గిరెడ్డిపై ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో దళితుల్లో వ్యతిరేకత నెల కొందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండోసారి మార్కెట్ చైర్మన్ పదవి ఇవ్వాలని గొల్లపల్లి డేవిడ్ ఎమ్మెల్యేను కోరగా ఆయన తిరస్కరించడంతో వీరిద్దరి మధ్య అభి ప్రాయ భేదాలు తలెత్తాయి. దీంతో వీరి మధ్య కొంత అగాధం ఏర్పడింది. ఈ క్రమంలో రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చక్రం తిప్పిన జగ్గిరెడ్డి అడా చైర్మన్ పదవిని గొల్లపల్లి డేవిడ్‌కు ఇవ్వాలని జిల్లాలోని ఎస్సీ ప్రజా ప్రతినిధులతోపాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు పొన్నాడ సతీష్ సహా అందరిపైనా ఒత్తిడి పెంచి ఆయనపై వైపు మొగ్గు చూపేలా చేసినట్టు సమాచారం. సామాజిక వర్గాల మధ్య సమతుల్యం సరిపోతుందనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అయితే జిల్లాలో కాపు సామాజికవర్గానికి చెందిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సీఎంతో సన్నిహితంగా మెలిగే వంటెద్దు వెంకన్నాయుడును అడా చైర్మన్ పదవి వరిస్తుందని అందరూ భావించారు. టౌన్ ప్లానింగ్‌పై అవగాహన ఉన్న నాయుడుకే సీఎం జగన్ లైన్ క్లియర్ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ స్థానిక వైసీపీ కీలక నేతల అడ్డంకితో నాయుడుకి గండి పడినట్టు తెలిసింది. వీరితోపాటు అంబాజీపేటలోని బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన పేరి కామేశ్వరరావు, మున్సిపల్ మాజీ ప్రతిపక్ష నేత చెల్లుబోయిన శ్రీనివాస్‌తోపాటు మరికొందరు నాయకులు అడా చైర్మన్ పదవిపై ఆశలు పెంచుకున్నారు. అయితే పార్టీలో దీర్ఘ కాలికంగా పనిచేసే వారిని పక్కన పెట్టి మెరుపుతీగల్లా ప్రత్యక్షమయ్యేవారికే పద వులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు ఇటీవల వైసీపీలో వ్యక్తం కావడంతోపాటు పార్టీ నాయకుల్లో తీవ్రమైన అసంతృప్తి జ్వాలలు అలుముకుంటున్నాయి. జిల్లాలో కాపు సామాజికవర్గానికి చెందిన తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ మినహా మిగిలిన నేతలెవరికీ వైసీపీలో సముచిత స్థానం దక్కకపోవడంతో ఆ పార్టీలోని సామాజిక వర్గీయులు అసంతృప్తి జ్వాలలతో రగిలిపోతున్నారు. అయినప్పటికీ అడా చైర్మన్ పదవి గొల్లపల్లి డేవిడ్‌రాజును వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోమ వారం పార్టీ నాయకులతోపాటు ఎమ్మెల్యే జగ్గిరెడ్డితో సహా నియోజకవర్గంలోని పలువురు డేవిడ్‌కు అనుకూలంగా పార్టీ నేతల ముందు బలసమీకరణ చేసినట్టు తెలిసింది. పార్టీ పరిశీలకుడైన ఎంపీ మిథున్‌రెడ్డి కూడా డేవిడ్‌రాజు పేరును ఖరారు చేసినట్టు తెలిసింది. ఈనెల 28వ తేదీన డేవిడ్‌రాజు నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
అడా ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ
120 రెవెన్యూ గ్రామాలు.. 7.09 లక్షల జనాభా... సోమవారం గెజిట్ విడుదల
అమలాపురం, మార్చి 20(ఆంధ్రజ్యోతి): అమ లాపురం అర్బన్ డెవలెప్‌మెంట్ అథారిటీ (ఏఎం యూడీఏ)ని ఏర్పాటుచేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ము న్సిపల్ అడ్మినిస్ర్టేటివ్ అర్బన్ డెవలెప్‌మెంట్ అథా రిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను జీవో ఎంఎస్ 35 ద్వారా విడుదల చేసింది. అర్బన్ డెవలెప్‌మెంట్ అథారిటీకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పరిశ్రమలు, డొమైన్లలో అద్భుతమైన వృద్ధిని సాధించడానికి దిగుమతులు, ఎగుమతులను ప్రోత్సహించే లక్ష్యం తో జిల్లా పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక పట్ట ణాభివృద్ధి ప్రాంతంగా పరిగణిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. కోనసీమ జిల్లా రెండు యూఎల్‌బీలను కలిగి ఉంది. 11 మండ లాల పరిధిలో 120 రెవెన్యూ గ్రామాలు, 896.16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అమలాపురం అర్బన్ డెవలెప్‌మెంట్ కార్యాలయ పరిధి విస్తరిం చి ఉంటుంది. 7.09 లక్షల జనాభాతో పట్టణాభి వృద్ధి ప్రాంతంగా ఆ ఉత్తర్వులో పరిగణించబడిం దని సదరు నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది.
Updated Date - 2023-03-21T01:31:35+05:30 IST