ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం

ABN, First Publish Date - 2023-01-28T23:43:46+05:30

అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారా యణరెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాపవరం భూముల్లో ఇళ్ల పట్టాలకు తాను అడ్డు వచ్చానని కోర్టుకు వెళ్లానని ప్రజలను వంచిస్తున్నారని దీనిని నిరూపిస్తే తాను రాజకీయం సన్యాసం తీసుకుంటానని లేకుంటే మీరు ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేస్తారా అంటూ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృ ష్ణారెడ్డి సవాల్‌ విసిరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేకపోతే మీరు రాజీనామా చేయాలి

ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సవాల్‌

కాపవరం భూములపై చర్చకు సిద్ధం.. అనపర్తిలో నిరసన

అనపర్తి, జనవరి 28: అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారా యణరెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని కాపవరం భూముల్లో ఇళ్ల పట్టాలకు తాను అడ్డు వచ్చానని కోర్టుకు వెళ్లానని ప్రజలను వంచిస్తున్నారని దీనిని నిరూపిస్తే తాను రాజకీయం సన్యాసం తీసుకుంటానని లేకుంటే మీరు ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేస్తారా అంటూ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృ ష్ణారెడ్డి సవాల్‌ విసిరారు. ఇటీవల ఎమ్మెల్యే డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి గడపగడపకూ తిరుగుతూ ఇళ్ల స్థలం అడిగిన ప్రజలతో కాపవరం నాగార్జున ఫెర్టిలైజర్స్‌కు చెందిన భూమిని ఇళ్ల పట్టాల కోసం సేకరి ంచామని దీనిని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలన్న ఉద్ధేశంతో కరపత్రాలను పంచుతున్నట్టు తెలిపారు. ముందుగా అనపర్తి దేవీచౌక్‌ నుంచి రైల్వేస్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. దేవీచౌక్‌వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. బిక్కవోలు మండలం కాపవరంలోని నాగార్జున ఫెర్టిలైజర్స్‌కు చెందిన 200 ఎకరాల్లో ఉన్న గ్రావెల్‌ను తరలించి సుమారు రూ.400 కోట్లు ఆర్జించాలని ఎమ్మెల్యే పథకం రచించారన్నారు. ఇళ్ల స్థలాల ముసుగులో గ్రావెల్‌ను అక్రమంగా తరలించడమే కాకుండా అక్కడ ఉన్న వృక్ష సంపదను దోచుకున్నారని కోర్టును ఆశ్రయించానన్నారు. అక్కడ అక్రమ మైనింగ్‌ జరగడం వాస్త వమేనని కోర్టు నిర్థారణ చేసి విజిలెన్స్‌ ఎంక్వయిరీ కూడా చేయించిందన్నారు. ఎమ్మెల్యే తన అసమర్థతను కప్పిపుచ్చు కునేందుకు ఇళ్ల స్థలాలకు నేను అడ్డుపడ్డానని కోర్టుకు వెళ్లానని అందుకే ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతున్నామని ప్రచారం చేస్తున్నారన్నారు. అసత్య ఆరోపణలతో ప్రజ లను వంచించడమే కాకుండా వలంటీర్లతో కూడా ప్రచారం చేయిస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా నా సవాల్‌ను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే తాను అన్న మాటలకు కట్టుబడి ఉంటానన్నారు. ఇళ్ల పట్టాలకు తాను కోర్డుద్వారా అడ్డుపడినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని లేకుంటే మీరు రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. అక్రమ గ్రావెల్‌ తవ్వకాలపై కోర్టును ఆశ్రయుంచిన విషయాన్ని బహిరంగంగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని లేదంటే మీకు ఇష్టమైన దైవ సన్నిధిలో సత్యప్రమాణానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. సవాల్‌ స్వీకరించే ధైర్యం లేకపోతే అసత్య ప్రచారాలను మానుకోవాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సిరసపల్లి నాగేశ్వరరావు, తమలంపూడి సుథాకరరెడ్డి, నల్లమిల్లి మనోజ్‌రెడ్డి, కర్రి వెంకటరామారెడ్డి, నూతిక బాబూ రావు, ఒంటిమి సూర్యప్రకాష్‌, మామిడిశెట్టి శ్రీను, సత్య, గంగిరెడ్డి, కాశీవిశ్వేశ్వ రరావు పాల్గొన్నారు.

పాల్గొన్నారు.

Updated Date - 2023-01-28T23:43:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising