ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

22 కిలోల గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2023-02-21T01:32:34+05:30

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 20: రాజమహేంద్రవరం రూరల్‌ మండలం శాటిలైట్‌ సిటీ సమీపంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం సమీపంలో గంజాయి అమ్ముతున్న నలుగురిని బొమ్మూరు పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక స్పిన్నింగ్‌ మిల్లు కాలనీకు చెందిన గెద్దాడ మనోజ్‌, హకుంపేట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 20: రాజమహేంద్రవరం రూరల్‌ మండలం శాటిలైట్‌ సిటీ సమీపంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం సమీపంలో గంజాయి అమ్ముతున్న నలుగురిని బొమ్మూరు పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక స్పిన్నింగ్‌ మిల్లు కాలనీకు చెందిన గెద్దాడ మనోజ్‌, హకుంపేటకు చెందిన తోట వినయ్‌, స్థానిక అయ్యప్పనగర్‌కు చెందిన కోట తులసీరాం, అయిదుబళ్ల మార్కెట్‌కు చెందిన దొంగ సౌదిరాజులు కలిసి విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కేజీ వెయ్యి రూపాయల చొప్పున 22 కిలోల గంజాయి కొనుగోలు చేసి దాన్ని రాజమహేంద్రవరం తరలించారు. ఇక్కడ దాన్ని అమ్ముతుండగా బొమ్మూరు ఎస్‌ఐ శివాజి సిబ్బందితో కలిసి వీరిని పట్టుకున్నారు. సీఐ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదుచేసి నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-02-21T01:32:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising