కోడిపందేలు, గుండాటలపై పోలీసుల దాడులు
ABN, First Publish Date - 2023-01-15T00:26:03+05:30
ఆయా గ్రామాల్లో కోడిపందేలు, గుండాటలపై దాడులు నిర్వహించి పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌ఐ నౌడు రామకృష్ణ తెలిపారు. గురజనాపల్లి, వేములవాడ, విజయరాయుడుపాలెం, గొర్రిపూడి గ్రామాల్లో కోడిపందేం శిబిరాలపై దాడులు చేసి 8కోడి
12 మంది నిందితుల అరెస్ట్
కరప, జనవరి 14: ఆయా గ్రామాల్లో కోడిపందేలు, గుండాటలపై దాడులు నిర్వహించి పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్‌ఐ నౌడు రామకృష్ణ తెలిపారు. గురజనాపల్లి, వేములవాడ, విజయరాయుడుపాలెం, గొర్రిపూడి గ్రామాల్లో కోడిపందేం శిబిరాలపై దాడులు చేసి 8కోడిపుంజులు, 8కత్తులు, రూ. 4,200 నగదు స్వాధీనం చేసుకుని 8మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే వాకాడ, పెదకొత్తూరు గ్రామాల్లో ని గుండాట నిర్వహిస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 2,200 నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ వివరించారు. దాడుల్లో ఏఎ్‌సఐలు ప్రసన్నకుమార్, సూరిబాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
తొమ్మిది కేసుల నమోదు
తునిరూరల్, జనవరి 14: పందెంరాయుళ్లు తుని మండల గ్రామల్లో పోలీసులు కళ్ళుగప్పి కోడి పందేలు, గుండాట, పేకాట నిర్వహించడంతో పోలీసులు దాడులు నిర్వహించి పదిహేను మందిని అదుపులోకి తీసుకున్నారు. తేటగుంట, ఎన్.సూరవరం, డి.పోలవరంలో బరులు ధ్వంసం చేసి పందెంరాయుళ్లను చెదరగొట్టారు. శనివారం 9కేసులు నమోదు చేసినట్టు ఎస్‌ఐ బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు.
Updated Date - 2023-01-15T00:26:04+05:30 IST