ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గడప గడప’లో వీడియోలు తీయొద్దు

ABN, First Publish Date - 2023-03-26T04:20:34+05:30

‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వీడియోలు తీయొద్దంటూ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సమక్షంలో ఆయన అనుచరులు బెదిరింపులకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఎమ్మెల్యే కొండేటి సమక్షంలో అనుచరుల వీరంగం

తీయొద్దనడానికి మీరెవరు?: స్థానికుల ఆగ్రహం

అమలాపురం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వీడియోలు తీయొద్దంటూ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సమక్షంలో ఆయన అనుచరులు బెదిరింపులకు దిగారు. శనివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లిలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఓ కుటుంబ సభ్యులు ఆయన్ను నిలదీశారు. ‘నా తండ్రికి ఇద్దరు సంతానం, నాకు ఇద్దరు సంతానం ఉన్నారు. రేషన్‌ కార్డు ఉంది. అన్ని అర్హతలూ ఉన్నా ఇంటి స్థలం పట్టా ఎందుకు ఇవ్వలేదు?’ అంటూ ఓ వ్యక్తి ఎమ్మెల్యేపై ప్రశ్నల వర్షం కురిపించాడు. ‘వలంటీరు మీ ఎదురుగానే ఉంది. ఎందుకు పేరు తీసేశారో చెప్పండ’ని ప్రశ్నించారు. ఈ ఘటనను స్థానిక యువకులు వీడియోలు, ఫొటోలు తీస్తుండగా ఎమ్మెల్యే అనుచరులు సెల్‌ఫోన్లు లాక్కొనే ప్రయత్నం చేశారు. వీడియోలు తీయొద్దని హుకుం జారీ చేశారు. దీంతో యువకులు, స్థానికులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఇళ్లకు వచ్చి వీడియోలు తీయొద్దనడానికి మీరెవరంటూ నిలదీశారు. దాంతో నాయకుల బృందం అక్కడి నుంచి వెనుదిరిగింది.

Updated Date - 2023-03-26T04:20:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising