ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైట్‌కు నేరుగా విమానం

ABN, First Publish Date - 2023-03-29T03:30:27+05:30

విజయవాడ నుంచి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ప్రతి బుధవారం కువైట్‌కు నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసును నడపనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెజవాడ నుంచి రెండో అంతర్జాతీయ సర్వీస్‌

విజయవాడ /గన్నవరం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): విజయవాడ నుంచి ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ ప్రతి బుధవారం కువైట్‌కు నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసును నడపనుంది. ఈ సర్వీసు ఈనెల 29నే ప్రారంభం కాబోతోంది. దీనికి ముందు వందేభారత్‌ మిషన్‌లో భాగంగా పలుదేశాలకు విజయవంతంగా విమాన సర్వీసులు నడిపింది. వందేభారత్‌ మిషన్‌ను కేంద్రం ఉపసంహరించుకోవటంతో ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు అత్యంత ఆదరణ ఉన్న దేశాలకు విజయవాడ నుంచి నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభిస్తోంది. విజయవాడ నుంచి షార్జాకు ఇటీవలే తొలి అంతర్జాతీయ సర్వీసును ప్రారంభించింది. దీంతో షార్జాకు రెండు సర్వీసులు అయ్యాయి. తాజాగా విజయవాడ నుంచి కువైట్‌కు రెగ్యులర్‌ విమాన సర్వీసును ప్రారంభిస్తోంది. ఈ విమానం తిరుచిరాపల్లి నుంచి విజయవాడ వస్తుంది. విజయవాడ నుంచి నేరుగా కువైట్‌ వెళుతుంది. 180 సీటింగ్‌తో విజయవాడ నుంచి బుధవారం 70 మంది ప్రయాణికులు కువైట్‌ వెళుతున్నారు. ప్రతి బుధవారం ఉదయం 9.55 గంటలకు విజయవాడలో బయలుదేరి మధ్యాహ్నం 2.40 గంటలకు కువైట్‌ చేరుతుంది. కువైట్‌లో సాయంత్రం 3.40 గంటలకు బయలుదేరి రాత్రి 8.35 గంటలకు విజయవాడ వస్తుంది.

Updated Date - 2023-03-29T03:30:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising