ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైబరాబాద్‌, అమరావతిలను చంద్రబాబు కాపీ కొట్టారా : ఆలపాటి

ABN, First Publish Date - 2023-06-02T04:25:37+05:30

‘దేశంలో ఎవరికీ ఆలోచన రాకముందే పాతికేళ్ల కిందటే చంద్రబాబు విజన్‌ 2020 తయారు చేసి అమలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): ‘‘దేశంలో ఎవరికీ ఆలోచన రాకముందే పాతికేళ్ల కిందటే చంద్రబాబు విజన్‌ 2020 తయారు చేసి అమలు చేశారు. ఆయనకు ఎవరినీ కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. ఐటీ హబ్‌గా సైబరాబాద్‌ అభివృద్ధి, అమరావతి నిర్మాణం కూడా చంద్రబాబు కాపీ కొట్టారా?’’ అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘టీడీపీ మేనిఫెస్టో ఎవరినో చూసి కాపీ కొట్టారని సీఎం జగన్‌ మాట్లాడుతున్నారు. దానిని ఏం విమర్శించాలో తెలియక సినిమా డైలాగులు రాసుకొచ్చి వల్లె వేస్తున్నారన్నారు. ప్రజలకు అరకొరగా సాయం చేసి అదే పెద్ద గొప్ప అన్నట్లుగా జగన్‌ ప్రచారం చేసుకొంటున్నారని, దానిని సవరించి ప్రతి కుటుంబానికి వీలైనంత సాయం అందించేలా చంద్రబాబు మేనిఫెస్టోను ప్రకటించారన్నారు. జగన్‌ పాలన అంత బాగుంటే ఆయన సమావేశాల నుంచి ప్రజలు ఎందుకు పారిపోతున్నారో వైసీపీ నేతలు ఆలోచించుకోవాలని అన్నారు.

Updated Date - 2023-06-02T04:27:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising