ఏపీలో దిగజారుతున్న రాజకీయాలు: కిషన్‌రెడ్డి
ABN, First Publish Date - 2023-03-05T03:54:56+05:30
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి.
విశాఖపట్నం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. కొన్ని కుటుంబాల మధ్య జరుగుతున్న ఘర్షణతో ప్రజలు నష్టపోతున్నారు’’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న పీవీఎన్ మాధవ్‌కు మద్దతుగా నగరంలోని రాక్‌డేల్ హోటల్‌లో వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కక్ష సాధింపులతో అభివృద్ధి సాధించలేమన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పాల్గొన్నారు.
తొమ్మిది రెట్లు పెరిగిన ఏపీ రైల్వే బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ రైల్వే బడ్జెట్ ఇటీవల కాలంలో తొమ్మిది రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రెండో రోజు శనివారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఏపీలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 72 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించే ప్రణాళిక ఉం’’దన్నారు.
Updated Date - 2023-03-05T03:54:56+05:30 IST