జగన పాలన ఉద్యోగికి మరణ యాతన: పట్టాభి
ABN, First Publish Date - 2023-06-07T04:16:03+05:30
జగన పాలన ఉద్యోగుల పాలిట మర ణ శాసనంగా మారిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు.
అమరావతి,జూన్ 6(ఆంధ్రజ్యోతి): జగన పాలన ఉద్యోగుల పాలిట మర ణ శాసనంగా మారిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు. రూ.7వేల కోట్ల డీఏ, పీఆర్సీ బకాయిలకుగాను కేవలం రూ.175 కోట్లు చెల్లించడం జగనరెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు న్యాయం చేసినట్టా? అని ప్రశ్నించారు. మంగళవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 11వ పీఆర్సీ నివేదికను నేటి వరకు బయటపెట్టని జగన.. 12వ పీఆర్సీ పేరుతో ఎవర్ని మోసం చేస్తారని నిలదీశారు. ప్రభుత్వ దురాగతాల్ని ప్రశ్నిస్తున్న ఉద్యోగ సంఘ నాయకులపై తప్పుడు కేసు పెట్టి, జైళ్లకు పంపడమేనా? ఉద్యోగులపై జగనరెడ్డికున్న ప్రేమ? అన్నారు.
Updated Date - 2023-06-07T04:16:03+05:30 IST