ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో దళితులకు రక్షణ కరవు

ABN, First Publish Date - 2023-06-07T02:45:24+05:30

రాష్ట్రంలో అధికార పార్టీతో సహా ప్రతిపక్ష టీడీపీ, జనసేన దళితులపై జరుగుతున్న దాడులను పట్టించుకున్న దాఖలాలు లేవని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ, టీడీపీ, జనసేన దళితులకు చేసిందేమీలేదు: హర్షకుమార్‌

మండపేట, జూన్‌ 6: రాష్ట్రంలో అధికార పార్టీతో సహా ప్రతిపక్ష టీడీపీ, జనసేన దళితులపై జరుగుతున్న దాడులను పట్టించుకున్న దాఖలాలు లేవని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ ఆరోపించారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు న్యాయం జరిగే వరకు పోరాడతానని, కేసులకు భయపడనని స్పష్టం చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులంతా దాడులను ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. దళిత వ్యతిరేక పార్టీ బీజేపీతో రాష్ట్రంలో అధికార పార్టీ, టీడీపీ, జనసేన పార్టీలు అంటకాగుతున్నాయని, వాటితో దళితులు కలిసే అవకాశం లేదన్నారు. 175 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత రాజకీయంపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థులను పోటీకి నిలబెడతానని చెప్పారు.

Updated Date - 2023-06-07T02:45:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising