పరిహారం కోసం దళిత కుటుంబం ఆందోళన
ABN, First Publish Date - 2023-07-07T04:24:23+05:30
ఎస్సీ, ఎస్టీ, పీఓఏ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ) చట్టం ప్రకారం తమకు అందాల్సిన పరిహారం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ దళిత కుటుంబం ఆందోళనకు దిగింది.
● తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా
యాడికి, జూలై 6: ఎస్సీ, ఎస్టీ, పీఓఏ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ) చట్టం ప్రకారం తమకు అందాల్సిన పరిహారం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ దళిత కుటుంబం ఆందోళనకు దిగింది. అనంతపురం జిల్లా యాడికి తహసీల్దారు కార్యాలయం వద్ద బాధితులు విష రసాయనం డబ్బా చేతబట్టుకుని గురువారం ధర్నా చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తహసీల్దారు కార్యాలయంపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. వారితో చర్చించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు.. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కోనుప్పలపాడుకు చెందిన రత్నకుమారి, ఓబన్న దంపతుల కుటుంబానికి, అదే గ్రామానికి చెందిన వైసీపీ వర్గీయులకు మధ్య నాలుగేళ్ల కిందట ఘర్షణ జరిగింది. వైసీపీ వర్గీయులు తమపై దాడి చేశారని ఓబన్న దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదయ్యింది. బాధిత కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ పీఓఏ చట్టం కింద రూ.2 లక్షలు పరిహారం, జీవనాధారానికి 5 ఎకరాల భూమి ఇస్తున్నట్టు నాటి కలెక్టర్, ఎస్పీ ప్రకటించారు. అయితే నాలుగేళ్లు గడిచినా బాధితులకు భూమిని కేటాయించలేదు. పరిహారం సొమ్ములో రూ.1.50 లక్షలు మాత్రమే ఇచ్చారు.
Updated Date - 2023-07-07T04:24:23+05:30 IST