రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..
ABN, First Publish Date - 2023-09-22T03:48:13+05:30
రాష్ట్రవ్యాప్తంగానూ సీపీఎస్ ఉద్యోగులు జీపీఎస్ బిల్లుకు వ్యతిరేకంగా భగ్గుమన్నారు. పలు జిల్లాల్లో మానవహారాలుగా నిలబడి నిరసన తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగానూ సీపీఎస్ ఉద్యోగులు జీపీఎస్ బిల్లుకు వ్యతిరేకంగా భగ్గుమన్నారు. పలు జిల్లాల్లో మానవహారాలుగా నిలబడి నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో అంబేడ్కర్‌కు, మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతులు సమర్పించారు. అనకాపల్లి జిల్లాలో నాలుగు రోడ్ల జంక్షన్‌లో మానవహారం నిర్వహించి ర్యాలీగా వెళ్లి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరుజిల్లాల్లోనూ నిరసనలు కొనసాగించారు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో భారీ ర్యాలీ నిర్వహించారు.
Updated Date - 2023-09-22T03:48:13+05:30 IST