ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హిందూపురం వైసీపీలో వర్గపోరు!

ABN, First Publish Date - 2023-08-22T03:15:02+05:30

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ భర్త బోయ శ్రీనివాసులును సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మట్కా నిర్వహిస్తున్నాడని, కర్ణాటక మద్యం విక్రయిస్తున్నాడని కేసులు పెట్టడంతోపాటు, పీడీ కేసు కూడా పెట్టించేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది.

పోలీసుల అదుపులో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త

మట్కా, మద్యం కేసులు పెడతారని ప్రచారం

హిందూపురం, ఆగస్టు 21: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ భర్త బోయ శ్రీనివాసులును సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మట్కా నిర్వహిస్తున్నాడని, కర్ణాటక మద్యం విక్రయిస్తున్నాడని కేసులు పెట్టడంతోపాటు, పీడీ కేసు కూడా పెట్టించేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది వైసీపీ అంతర్గత పోరులో భాగమేనని ఆ పార్టీవారు అంటున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ను పంపించేసి, ఇటీవల దీపికకు ఆ బాధ్యతలను అప్పగించారు. అధికశాతం మంది ప్రజాప్రతినిధులు దీపిక వర్గంలో చేరిపోయారు. కానీ చైర్‌పర్సన్‌ ఇంద్రజతోపాటు, కొంతమంది కౌన్సిలర్లు మాత్రం దీపిక వద్దకు వెళ్లలేదు. దీంతో ఆమె భర్తపై ఉన్న పాత కేసులను తిరగదోడుతున్నారని సమాచారం. ఈ నెల 25న జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హిందూపురానికి వస్తున్నారు. ఈ లోగా చైర్‌పర్సన్‌పై కూడా ఏదో ఒక కేసు పెట్టి, ఆమెను పదవి నుంచి తప్పించాలని దీపిక వర్గం భావిస్తోందంటున్నారు. నూతన సమన్వయకర్త వద్దకు వెళ్లనందుకే తమపై అక్రమ కేసులు బనాయించాలని చూస్తున్నారని చైర్‌పర్సన్‌ ఇంద్రజ తెలిపారు. బీసీ మహిళనైన తనను ఈ విధంగా రచ్చకీడుస్తారా అంటూ.. ఈ విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళతామని ఆమె చెప్పారు.

Updated Date - 2023-08-22T03:15:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising