ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘లైవ్‌ స్టాక్‌ మిషన్‌’లో యువత భాగస్వాములు కావాలి

ABN, First Publish Date - 2023-09-22T00:46:17+05:30

జాతీయ లైవ్‌ స్టాక్‌ మిషన్‌ పథకంలో యువత భాగస్వాములై పశుగణాభివృద్ధితో ప్రయోజనం పొందాలని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి ప్రభాకర్‌ సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా పశుసంవర్థక శాఖాధికారి ప్రభాకర్‌

చిత్తూరు (సెంట్రల్‌), సెప్టెంబరు 21: జాతీయ లైవ్‌ స్టాక్‌ మిషన్‌ పథకంలో యువత భాగస్వాములై పశుగణాభివృద్ధితో ప్రయోజనం పొందాలని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి ప్రభాకర్‌ సూచించారు. ఔత్సాహికులైన నిరుద్యోగ యువతకు గురువారం చిత్తూరులోని అంబేడ్కర్‌ భవన్‌లో జాతీయ లైవ్‌ స్టాక్‌ మిషన్‌ ద్వారా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ పథకం కింద మేకలు, పొట్టేళ్లు గొర్రెలు, నాటుకోళ్లు అభివృద్ధి.. పాతరగడ్డి దాణా తయారీ యూనిట్లు రాయితీపై మంజూరు చేయనున్నట్లు చెప్పారు. వంద మేకలు, ఐదు పొట్టేళ్ల యూనిట్‌కు గరిష్ఠంగా రూ.10 లక్షలు, ఇలా ఐదు వందల గొర్రెలు/మేకలు 25 పెట్టేళ్లు/ మేకపోతులకు రూ.50 లక్షల వరకు రాయితీ ఇస్తామన్నారు. అనుభవం గల వ్యక్తిగత పశుపోషకులు, రైతు ఉత్పాదకత సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, జాయింట్‌ లయబిలిటీ గ్రూపులు, సెక్షన్‌-8 కంపెనీల నుంచి అర్హత ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాడి రైతులు, యువత పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T00:46:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising