ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

థామస్‌ నాయకత్వంలో పనిచేయండి

ABN, First Publish Date - 2023-06-11T01:42:56+05:30

జీడీనెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ థామస్‌ నాయకత్వంలో పనిచేయాలని మాజీ మంత్రి అమరనాథరెడ్డి సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిట్టిబాబుకు న్యాయం చేస్తాం

మాజీ మంత్రి అమరనాథ రెడ్డి

చిత్తూరు, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): జీడీనెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ థామస్‌ నాయకత్వంలో పనిచేయాలని మాజీ మంత్రి అమరనాథరెడ్డి సూచించారు. ఎస్‌ఆర్‌పురం మండల టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని శనివారం నిర్వహించారు. అమర్‌తోపాటు జిల్లా కో-ఆర్డినేటర్‌ బీద రవిచంద్ర, నియోజకవర్గ పరిశీలకుడు మబ్బు దేవనారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందే ‘థామ్‌సను అధిష్ఠానం ఇన్‌చార్జిగా నియమించిన నేపథ్యంలో కో-ఆర్డినేటర్‌గా భీమినేని చిట్టిబాబు వద్దు’ అని ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, ఇతర సీనియర్లు మాజీమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అక్కడే ఉండి ఈ విషయాన్ని గమనించిన చిట్టిబాబు సమావేశం ప్రారంభం కాకముందే అలిగి వెళ్లిపోయారు. దీనిపై చిట్టిబాబు అనుచరులు టీడీపీ జిందాబాద్‌, చంద్రబాబు నాయకత్వం వర్థిల్లాలి, చిట్టిబాబును కొనసాగించాలి.. అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అమర్‌ మాట్లాడుతూ.. చిట్టిబాబుకు అధిష్ఠానం సూచన మేరకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. థామస్‌ మాట్లాడుతూ.. అందరం కలిసి మాట్లాడుకుని పార్టీ విజయం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. వర్షం అధికం కావడంతో సమీక్ష వాయిదా పడింది. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, నగరి ఇన్‌చార్జి గాలి భానుప్రకాష్‌, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కార్జాల అరుణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T01:42:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising