ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భర్తపై భార్య బంధువుల దాడి.. కేసు నమోదు

ABN, First Publish Date - 2023-07-29T23:53:44+05:30

భర్తపై భార్య బంధువులు దాడిచేశారు.

ఏర్పేడు, జూలై 29: భర్తపై భార్య బంధువులు దాడిచేశారు. పోలీసుల కథనం మేరకు.. ఏర్పేడు జంగాలపల్లె గ్రామానికి చెందిన సునీల్‌కు, తిరుమలకు చెందిన పావనికి 2021లో వివాహం జరిగింది. వారికి ఏడాది కుమార్తె ఉంది. వీరి మధ్య కొన్నిరోజులుగా కుటుంబ కలహాలున్నాయి. ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంతో తిరుపతి దిశ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 27వ తేదీన పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. కౌన్సిలింగ్‌ ముగిశాక సునీల్‌, అతడి తండ్రి వాసుదేవయ్య జంగాలపల్లె గ్రామానికి వస్తుండగా ఏర్పేడు రైల్వేగేటు సమీపంలో పావని బంధువులు దాడిచేశారు. సునీల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏర్పేడు పోలీసులకు పావని తరపు బంధువులు మధుమోహన్‌, సంపూర్ణ, పావని, భాగ్యమ్మ, రుచిత, హేమంత్‌గణేష్‌పై కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-07-29T23:53:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising