ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డ్రగ్‌ ఫ్రీ జిల్లాగా మారుస్తాం

ABN, First Publish Date - 2023-06-26T23:47:50+05:30

చిత్తూరును డ్రగ్‌ ఫ్రీ జిల్లాగా మార్చడానికి సహకరిస్తామంటూ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సోమవారం చిత్తూరులో గాంధీ విగ్రహం నుంచి విద్యార్థులతో కలిసి పోలీసులు ర్యాలీ నిర్వహించారు.

ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు, జూన్‌ 26: చిత్తూరును డ్రగ్‌ ఫ్రీ జిల్లాగా మార్చడానికి సహకరిస్తామంటూ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సోమవారం చిత్తూరులో గాంధీ విగ్రహం నుంచి విద్యార్థులతో కలిసి పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్పీ రిషాంత్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. సరదాగా మొదలయ్యే ఈ మాదకద్రవ్యాల అలవాటు చివరగా బానిసగా మారుస్తుందని హెచ్చరించారు. మాదకద్రవ్యాల విక్రేతలపై పీడీయాక్టును నమోదు చేస్తున్నామన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచడానికి పాఠశాలలు, కళాశాలల్లో పోస్టర్లను ఆవిష్కరించి ప్రచారం కల్పిస్తున్నామని సెబ్‌ ఏఎస్పీ శ్రీలక్ష్మి చెప్పారు. మాదకద్రవ్యాల విక్రయాలు జరిగినట్లు తెలిస్తే డయల్‌ 100 లేదా ప్రత్యేక ఫిర్యాదుల నెంబరు 14500 లేదా 9440900005కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ ఏఎస్పీ నాగేశ్వరరావు, నగర డీఎస్పీ శ్రీనివాసమూర్తి, ఎస్‌బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, డీటీసీ డీఎస్పీ శ్రావన్‌కుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ మురళీధర్‌, సీఐలు విశ్వనాథరెడ్డి, మద్దయ్యచ్చారి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:47:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising