ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూతలపట్టు నియోజకవర్గంలోకి పాదయాత్ర

ABN, First Publish Date - 2023-02-03T00:26:30+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర పూతలపట్టు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. గురువారం సాయంత్రం 6.05 గంటలకు బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్‌ దొరచెరువు వద్దకు లోకేశ్‌ చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంగారుపాళ్యం, ఫిబ్రవరి 2: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర పూతలపట్టు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. గురువారం సాయంత్రం 6.05 గంటలకు బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్‌ దొరచెరువు వద్దకు లోకేశ్‌ చేరుకున్నారు. ఆయనకు మండల టీడీపీ అధ్యక్ష, కార్యదర్శులు జయప్రకా్‌షనాయుడు, జనార్దన్‌గౌడ్‌, ఇతర నేతలు స్వాగతం పలికారు. అనంతరం లోకేశ్‌, నాయకులు, కార్యకర్తలతో కలిసి మొగిలి గ్రామానికి 6.45 గంటలకు చేరుకున్నారు. అంతకుముందు మార్గమధ్యమైన శ్రీనిఫుడ్స్‌ వద్ద ఫ్యాక్టరీ కార్మికులతో సెల్ఫీ దిగారు. మొగిలీశ్వరం ఆలయం ముందు పూలదుకాణాలు పెట్టుకుంటున్న మహిళలతో ముచ్చటించారు. ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన విడిది కేంద్రానికి వెళ్ళారు. స్వాగతం పలికిన వారిలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, మాజీ ఎమ్మెల్యే రవి, తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌, నియోజకవర్గ పరిశీలకుడు పెళ్ళకూరు శ్రీనివాసులురెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ జయచంద్రనాయుడు, ఎన్‌ఆర్‌ఐ విక్రమ్‌ చౌదరి, చిత్తూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, ధరణీ నాయుడు, కమలనాథరెడ్డి, కోకా ప్రకా్‌షనాయుడు, నవీన్‌ చౌదరి, బాష్యం వంశీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-03T00:26:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising