ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TTD EO : అత్యుత్సాహంతో ఆలయాన్ని చిత్రీకరించారు..

ABN, First Publish Date - 2023-01-23T12:23:57+05:30

డ్రోన్‌కి సంబంధించి ఐఓసీకి పర్మిషన్ ఇవ్వడం వాస్తవమేనని టీటీడీ ఈవో ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఓసీ సిబ్బంది అత్యుత్సాహంతో ఆలయాన్ని డ్రోన్ తో చిత్రీకరించారన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

TTD EO Dharma Reddy : డ్రోన్‌కి సంబంధించి ఐఓసీకి పర్మిషన్ ఇవ్వడం వాస్తవమేనని టీటీడీ ఈవో ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఓసీ సిబ్బంది అత్యుత్సాహంతో ఆలయాన్ని డ్రోన్ తో చిత్రీకరించారన్నారు. ఐఓసీ సిబ్బందిపై కేసు నమోదు చేశామన్నారు. డ్రోన్‌తో శ్రీవారి ఆలయం చిత్రికరణపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. యూట్యూబ్‌లో ఉన్న వీడియోను తొలగించామన్నారు. తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టమ్ తీసుకొని వస్తున్నామని ధర్మారెడ్డి వెల్లడించారు. గదుల కేటాయింపుతో రూ.71.41 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.

టీటీడీ ఆధ్వర్యంలో 396 కళ్యాణ మండపాలు ఉన్నాయని.. తిరుపతిలోని శ్రీనివాస కళ్యాణ మండపానికీ మరమ్మతులు చేశామన్నారు. స్థానికుల కోరిక మేరకే ఆధునికరించి.. అద్దె ధరను పెంచామని ధర్మారెడ్డి వెల్లడించారు. 384 కళ్యాణ మండపాల అద్దె ధరలను పెంచలేదన్నారు. తిరుమలలో ఉద్యోగులకు కేటాయించిన 850 గదుల్లో..650 గదులను వెనక్కి తీసుకొని సామాన్య భక్తులకు కేటాయిస్తున్నామన్నారు. ఇంకా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ‘‘శ్రీవారికి లక్ష రూపాయల విరాళాలు ఇచ్చే భక్తులు తక్కువ. లక్ష రూపాయలు విరాళం ఇచ్చిన భక్తులకు దర్శనం, గదులు ఇచ్చే వెసులు బాటు ఉండేది.

శ్రీవాణి ట్రస్టుకి రూ.10 వేలు విరాళం ఇచ్చిన భక్తులకు ఒక్కసారి బ్రేక్ దర్శనం ఇచ్చే పద్ధతిని తీసుకొని వచ్చాం. శ్రీవాణి ట్రస్టు ద్వారా దాదాపు రూ.650 కోట్ల నిధులు సమకూరాయి. ఈ నిధులతో 26 జిల్లాల్లో 2068 ఆలయాలు నిర్మాణంలో ఉన్నాయి. సమరత సంస్థ ఫౌండేషన్ ద్వారా ఈ ఆలయాల నిర్మాణం పనులు జరుగుతున్నాయి. 111 ఆలయాల పనులు పూర్తి అయ్యాయి. 320 ఆలయాల నిర్మాణానికి 32 కోట్ల రూపాయలను మంజూరు చేశాం. దేవాదాయ శాఖ ద్వారా 932 ఆలయాల మరమ్మత్తులకు రూ.100 కోట్లు.. పురాతన 150 ఆలయాలకు జీర్ణోద్ధరణకూ రూ.130 కోట్లు కేటాయించాం.. ఆరు నెలల్లో అన్ని ఆలయాల నిర్మాణాలనూ పూర్తి చేస్తాం’’ అని తెలిపారు.

Updated Date - 2023-01-23T12:25:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising