ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవకాశవాదులను నమ్ముకుని పతనం

ABN, First Publish Date - 2023-05-02T00:51:23+05:30

అవకాశవాదులను నమ్ముకుని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పతనం అవుతున్నారని కార్వేటినగరం మండలం అన్నూరు ఎంపీటీసీ దాసరి పొన్నుస్వామి విమర్శిస్తూ వీడియో విడుదల చేశారు.

పొన్నుస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డిప్యూటీ సీఎంను ఉద్దేశించి ఎంపీటీసీ వీడియో విడుదల

వెదురుకుప్పం, మే 1: అవకాశవాదులను నమ్ముకుని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పతనం అవుతున్నారని కార్వేటినగరం మండలం అన్నూరు ఎంపీటీసీ దాసరి పొన్నుస్వామి విమర్శిస్తూ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ‘నారాయణస్వామితో వైసీపీకి నష్టం. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ ఇస్తే పార్టీ కోసం పని చేయం’ అంటూ ఏప్రిల్‌ 29న డిప్యూటీ సీఎం మేనల్లుడు రమేశ్‌, అన్నూరు సర్పంచి సుందరరాజుమూర్తితో కలిసి ఎంపీటీసీ పొన్నుస్వామి తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. దీనిపై కార్వేటినగరంలో ఆదివారం కొందరు ఎంపీటీసీపై తీవ్ర విమర్శలు చేశారు. ఎంపీటీసీ పదవికి రాజీనామా చేయాలని డిమాండు చేశారు. ఈ క్రమంలో పొన్నుస్వామి వీడియో విడుదల చేశారు. తమ గ్రామ సమస్యలు పరిష్కరించలేదన్న బాధ వ్యక్తం చేశాను తప్ప స్వార్థం కోసం విమర్శలు చేయలేదని ఆ వీడియోలో పేర్కొన్నారు. గతంలో తన పనిచేయలేదని నారాయణస్వామిని శ్రీనివాసులే తన వద్దే బూతులు తిట్టారని.. గతంలో గడప గడపకు వెళ్లినపుడు కార్వేటినగరం పెద్ద హరిజనవాడలో దళిత మహిళలను డిప్యూటీ సీఎంపైకి శేషాద్రి రెచ్చగొట్టారని ఆరోపించారు. అలాంటి వారిని పక్కన పెట్టుకుని పతనమవుతున్నారన్నారు. ఇక ఎంపీటీసీ పదవికి రాజీనామా చేయడానికి ఆయన సోమవారం కార్వేటినగరం చేరుకున్నారు. తమ పార్టీ నాయకులు వస్తే వారి సమక్షంలో ఎంపీడీవోకి రాజీనామా పత్రాన్ని ఇస్తానని చెప్పారు. సాయంత్రం వరకు ఎవరూ రాలేదు. తన రాజీనామా పత్రాన్ని ఎంపీడీవోకి ఇవ్వడానికి ఎంపీపీ భర్త, పార్టీ మండలాధ్యక్షుడిని రమ్మంటే రాలేదని పొన్నుస్వామి మీడియాతో అన్నారు. ‘ఈ పనికి మాలిన బ్యాచ్‌తో నన్ను తిట్టించే ప్రయత్నం చేయొద్దు. ఆత్మాభిమానం దెబ్బతినే ఇంతవరకు వచ్చా. మరోసారి దెబ్బతీసుకుంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’ అంటూ డిప్యూటీ సీఎంను ఉద్దేశించి అన్నారు.

Updated Date - 2023-05-02T00:51:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising