ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పులకించిన షార్‌

ABN, First Publish Date - 2023-07-15T01:26:29+05:30

చంద్రయాన్‌ 3 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూడడానికి దేశంలోని అనేకప్రాంతాల నుంచి వచ్చినవారితో శ్రీహరికోటలోని సందర్శకుల గ్యాలరీ జనసముద్రంగా మారింది.

రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షిస్తున్న వీక్షకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తడ, జూలై 14: చంద్రయాన్‌ 3 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూడడానికి దేశంలోని అనేకప్రాంతాల నుంచి వచ్చినవారితో శ్రీహరికోటలోని సందర్శకుల గ్యాలరీ జనసముద్రంగా మారింది. సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోట దాకా వాహనాలు, ప్రజలూ బారులు తీరి కనిపించారు. నెత్తి మాడ్చే ఎండనూ లెక్కచేయకుండా తూర్పు దిక్కుకేసి చూస్తూ నిలబడ్డారు. ప్రయోగానికి సమయం దగ్గరపడగానే గ్యాలరీ నిశ్శబ్దంగా మారిపోయింది. చివరి కౌంట్‌డౌన్‌ వినబడగానే గ్యాలరీల్లోని వేలాది మంది పది.. తొమ్మిది.. అంటూ గొంతు కలిపారు. జీరో అనగానే చెట్ల వెనుకనుంచి ఆకాశంలోకి నిప్పులుకురిపిస్తూ ఎగిరిన రాకెట్‌ను చూసి చప్పట్లతో హోరెత్తించారు. ఈలలు, ఉత్సాహపు అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. టాటా.. బైబై.. అంటూ చేతులూపుతూ సందడి చేశారు. దాదాపుగా ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌ కెమెరాల్లో రాకెట్‌ ప్రయోగాన్ని చిత్రిస్తూ కనిపించారు.

షార్‌కు తీర్ధయాత్రలా జనం

చంద్రయాన్‌3 ప్రయోగాన్ని శ్రీహరికోట నుంచే ప్రత్యక్షంగా చూసేందుకు దేశంలోని సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చారు. మన రాష్ట్ర ఆర్టీసీ, శ్రీకాకుళం, విజయనగరం, ఆవనిగడ్డ, శ్రీశైలం, మదనపల్లి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాదు, వైజాగ్‌, విజయవాడ, చెన్నై వంటి ప్రాంతాల నుంచి జనం రైళ్లలో సైతం తరలి వచ్చారు. కార్లయితే పులికాట్‌ సరస్సులోంచి దారితీసే రోడ్డంతా బారులు తీరాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే వీరంతా శ్రీహరికోటకు చేరుకోవడం మొదలు పెట్టారు. వందలాది వాహనాలు ఒక్కసారిగా రావడంతో శ్రీహరికోట వద్ద ట్రాఫిక్‌ కొంతసేపు నిలిచిపోయింది. పాసులు ఉంటే తప్ప సీఐఎ్‌సఎఫ్‌ భద్రతా దళాలు గ్యాలరీలలోకి అనుమతించలేదు. దీంతో పాసులు లేని వారు నిరాశగా వెనుతిరిగి, వేనాడురోడ్డు మీదకు చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రయోగాన్ని వీక్షించారు. ఇంత భారీ సంఖ్యలో సందర్శకులు రావడం షార్‌ చరిత్రలో ఇదే తొలిసారి.

‘‘ఇది వేలాదిమంది ఇస్రో శాస్త్రవేత్తల, ఉద్యోగుల కృషి. దేశ ప్రజల ప్రార్ధనల ఫలితం. అయితే ముందుందన్నది మరింత సంక్లిష్ట సమయం. ప్రతి అడుగు, ప్రతి దశ కష్టతరమైనది. అధిగమిస్తాం. ఆగస్టు 23 సాయంత్రం 5:47 గంటలకు చంద్రయాన్‌-3 చంద్రుడి ఉపరి తలంమీద సురక్షితంగా దిగుతుంది.’’

- సోమనాథ్‌, ఇస్రో చైర్మన్‌

Updated Date - 2023-07-15T01:26:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising