ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొండవాడలో చోరీ

ABN, First Publish Date - 2023-04-10T00:42:07+05:30

మండలంలోని తొండవాడకు చెందిన మురళీకృష్ణ శర్మ ఇంట్లో చోరీ జరిగింది. 10 గ్రాముల బంగారు నల్లపూసల దండ, 4 గ్రాముల బంగారు కమ్మలు, రూ.45 వేల నగదు చోరీకి గురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చంద్రగిరి, ఏప్రిల్‌ 9: మండలంలోని తొండవాడకు చెందిన మురళీకృష్ణ శర్మ ఇంట్లో చోరీ జరిగింది. 10 గ్రాముల బంగారు నల్లపూసల దండ, 4 గ్రాముల బంగారు కమ్మలు, రూ.45 వేల నగదు చోరీకి గురైంది. బాధితుడి కథనం మేరకు.. మూడు రోజుల క్రితం మురళీకృష్ణ శర్మ నెల్లూరు సమీపంలోని బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో సహా వెళ్లారు. ఆదివారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. తాళాలు పగిలిపోయి ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లోని బంగారు, నగదు కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ఇంటిని పరిశీలించారు. వేలిముద్రల నిపుణులు ఆధారాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-04-10T00:42:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising