ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఉయ్యాలవాడ’ శిలాఫలకం మళ్లీ ధ్వంసం

ABN, First Publish Date - 2023-04-02T00:37:21+05:30

వెదురుకుప్పంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి శిలాఫలకాన్ని గుర్తు తెలియని దుండగులు మళ్లీ ధ్వంసం చేశారని శనివారం ఏపీ రెడ్డి సంఘం వెదురుకుప్పం నాయకులు మీడియాకు తెలిపారు.

వెదురుకుప్పంలో మళ్లీ ధ్వంసమైన ఉయ్యాలవాడ శిలాఫలకం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వెదురుకుప్పం, ఏప్రిల్‌ 1: వెదురుకుప్పంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి శిలాఫలకాన్ని గుర్తు తెలియని దుండగులు మళ్లీ ధ్వంసం చేశారని శనివారం ఏపీ రెడ్డి సంఘం వెదురుకుప్పం నాయకులు మీడియాకు తెలిపారు. మార్చి 27వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శిలాఫలకాన్ని ధ్వంసం చేయడంతో 28వ తేదీన వెదురుకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత అదే స్థానంలో మరో శిలాఫలకం పెట్టగా మరోసారి ధ్వంసం చేశారని ఆ సంఘ నేత బోడిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను భావి తరాలకు తెలియజేయడానికి విగ్రహాలను పెడతారని గుర్తు చేశారు. అటువంటప్పుడు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. విషయం తెలుసుకున్న కార్వేటినగరం సీఐ చంద్రశేఖర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Updated Date - 2023-04-02T00:37:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising