ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో కాటేజీల పునర్నిర్మాణానికి టెండర్లు

ABN, First Publish Date - 2023-02-07T04:04:56+05:30

తిరుమలలో మరమ్మతులకు గురైన కాటేజీల పునర్నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ సోమవారం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హెచ్‌వీడీలో ఓ కాటేజీకి రికార్డు స్థాయిలో రూ.21 కోట్లతో టెండర్‌

తిరుమల, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): తిరుమలలో మరమ్మతులకు గురైన కాటేజీల పునర్నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ సోమవారం జరిగింది. ఇందులో హెచ్‌వీడీసీలోని ఓ కాటేజీ నిర్మాణానికి రికార్డుస్థాయిలో దా దాపు రూ.21 కోట్లకు టీటీడీ బోర్డు సభ్యుడు జీవన్‌రెడ్డి టెండర్‌ వేయడం గమనార్హం. తిరుమలలోని 13 విశ్రాంతి గృహాల పునర్నిర్మాణం, పునరుద్ధరణకు కాటేజీ డోనర్‌ స్కీం కింద దాతల నుంచి టెండర్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ.5.50 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు పలువురు టెండర్లు వేసి టీటీడీకి విరాళం అందజేశారు. తాజాగా హెచ్‌వీడీసీలో 493, 496 కాటేజీలతో పాటు టీబీసీలోని మరో ఏడు కాటేజీల పునర్నిర్మాణానికి కనీస విరాళం రూ.5 కోట్లుగా నిర్ణయించి టీటీడీ టెండర్లు ఆహ్వానించింది. పలువురి నుంచి వచ్చిన సీల్డ్‌ కవర్‌ టెండర్లను సోమవారం టీటీడీ సీఈ, ఎస్‌ఈ, ఈఈ, డీఎఫ్‌వో ఆధ్వర్యంలో టీటీడీ ఎస్టేట్‌ ఆఫీసర్‌ మల్లిఖార్జున, ఏఈవో భాస్కరనారాయణ చౌదరి తెరిచి అధిక మొత్తంలో టెండర్లు వేసిన వారికి కాటేజీల నిర్మాణాన్ని ఖరారు చేశారు. టెండరు వేసిన దాతలు నెలరోజులలోపు మొత్తం విరాళాన్ని టీటీడీకి చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం కాటేజీ నిర్మాణానికి వీరిని అనుమతిస్తారు. కాగా.. కాటేజీ డోనర్‌ స్కీం కింద నిర్మాణం పూర్తిచేసిన భవనంలో ఓ గదిని దాతకు కేటాయిస్తారు.

Updated Date - 2023-02-07T04:04:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising