ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హైస్కూల్‌ ప్లస్‌లో టీచర్లకు జీతాలెప్పుడో..!

ABN, First Publish Date - 2023-08-02T01:10:09+05:30

ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన హైస్కూల్‌ ప్ల్‌సలలో పనిచేసే టీచర్లు, ఎంఈవో-2లకు రెండునెలలుగా జీతాలు రావడం లేదు.

- రెండునెలలుగా సతమతమవుతున్న ప్లస్‌టూ టీచర్లు

తిరుపతి(విద్య),ఆగస్టు1: ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన హైస్కూల్‌ ప్ల్‌సలలో పనిచేసే టీచర్లు, ఎంఈవో-2లకు రెండునెలలుగా జీతాలు రావడం లేదు. మే నెలలో పీజీ విద్యార్హత ఉన్న టీచర్లకు ఒక ఇంక్రిమెంట్‌ ఇచ్చి హైస్కూల్‌ప్ల్‌సలో వివిధ సబ్జెక్టులకు ప్లస్‌టూ టీచర్లను నియమించారు. అలాగే ఎంఈవో-2లను కూడా కొత్తగా నియమించారు.అయితే వీరి క్యాడర్‌ స్ర్టెంత్‌ అప్‌డేషన్‌ చేయకపోవడంతో అప్పటినుంచి జీతాలందక వారంతా ఇబ్బంది పడుతున్నారు.ఈ నెలకు సంబంధించి 6వతేదీలోపు క్యాడర్‌ స్ర్టెంత్‌ అప్‌డేషన్‌ చేయకపోతే ఈ నెల జీతాలు కూడా అందే పరిస్థితి లేదని టీచర్లు వాపోతున్నారు. అప్‌డేషన్‌ ప్రక్రియ ఇంకా ప్రాసె్‌సలో ఉందని..దీంతో ఈనెలలో కూడా జీతాలు పడతాయో లేదోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. జిల్లాలో 25స్కూళ్లలో దాదాపు 120మందికి పైగా హైస్కూల్‌ ప్ల్‌సటూ టీచర్లుగా పనిచేస్తుండగా...34మంది ఎంఈవో-2లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.రెండునెలలుగా జీతాలివ్వకపోవడంతో కుటుంబఖర్చులు, లోన్లు, పిల్లల చదువులు, ఇంటిబాడుగలు చెల్లించలేకుండా ఇబ్బందిపడుతున్నామని పలువురు టీచర్లు వాపోతున్నారు. ఈ నెలలోనైనా జీతాలందేలా అధికారులు చూడాలని కోరుతున్నారు.

Updated Date - 2023-08-02T01:10:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising